E-Paper
Advertisement

క్రికెట్ మానేసి, ఇంట్లో కూర్చోవ‌డం బెట‌ర్‌..పాకిస్తాన్ జ‌ట్టు ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్

క్రికెట్ మానేసి, ఇంట్లో కూర్చోవ‌డం బెట‌ర్‌..పాకిస్తాన్ జ‌ట్టు ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్
Advertisement

Tanveer Ahmed On PAK VS ENG:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( PAK VS ENG) మధ్య ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 27వ తేదీన ఈ రెండు జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ వేదికగా రెండో టెస్టు షురూ అయింది. ఇందులో కూడా పాకిస్తాన్ తీరు మారలేదు. బాబర్ ఆజం వచ్చిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయగా, పాకిస్తాన్ సెకండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులకే కుప్పకూలింది పాకిస్తాన్. దీంతో ఆ జట్టు ప్లేయర్లపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

క్రికెట్ మానేసి, ఇంట్లో కూర్చోవ‌డం బెట‌ర్‌..పాకిస్తాన్ జ‌ట్టు ప‌రువు తీసిన త‌న్వీర్

లండన్ లోని లార్డ్స్ వేదికగా 110 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు ఇక క్రికెట్ ఆడటం మానేస్తే బెటర్ అంటూ సూచనలు చేశారు. క్రికెట్ మానేసి ఇంట్లో ఓ మూలన కూర్చుంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు డబ్బులైన మిగులుతాయని పరువు తీశారు. బాబర్ ఆజం వచ్చాడు.. పాకిస్తాన్ ఇరగదీస్తుందని అనుకున్నాం… ఆ దరిద్రుడు వచ్చిన తర్వాత ఇంకా దిగజారి ఆడుతున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ప్ర‌తిభావంతులైన ఆట‌గాళ్లు లేక విఫ‌లం

పొద్దున లేస్తే పాకిస్తాన్ జట్టు కుప్పకూలింది… ఓడిపోయింది అనే మాటలు విని అవమానంగా ఉందని తన్వీర్ అహ్మద్ తెలిపారు. ఈ బాధల కంటే పాకిస్తాన్ ఆటగాళ్లు క్రికెట్ ఆడడమే మానేస్తే, చాలా ఉత్తమం అంటూ వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ గడ్డపై కనీస పోటీని కూడా పాకిస్తాన్ ప్లేయర్లు ఇవ్వడం లేదని… ఇది క్షమించరాని నేరమంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఒకటే కాదు… వ్యవస్థలో కూడా పూర్తి వైఫల్యం ఉందన్నారు. తోపు ఆటగాళ్ల‌ను జ‌ట్టులోకి తీసుకురావడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దారుణంగా విఫలమైందని ఆరోపణలు చేశారు.

Advertisement

ప్రతిభావంతులైన వాళ్లకు అవకాశం ఇవ్వడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విఫలమౌతూ వస్తుందని నిప్పులు చెరిగారు త‌న్వీర్ అహ్మ‌ద్. ఇది ఇలా ఉండ‌గా, లండన్ లోని లార్డ్స్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 290 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 110 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండు 81 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×