Sci Fi Web Series : హెడ్ సెట్ ను వీడియో గేమ్స్ ఆడటానికి, పాటలు వినడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ ఈ మిస్టీరియస్ హెడ్సెట్ ను వాడితే మాత్రం ఏకంగా ఫ్యూచర్లోకి అడుగు పెడతారు. ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ‘ది ఫెరిఫరల్’ (The Peripheral 2022) అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ విలియం గిబ్సన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ను వెస్ట్ వరల్డ్ మేకర్స్ జొనాథన్ నోలన్, లిసా జాయ్ నిర్మించారు. టైం ట్రావెల్, క్వాంటం ఫిజిక్స్ కాన్సెప్ట్ లతో సాగే ఇది ఈ సిరీస్ ఎక్కడ స్ట్రిమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
అమెరికాలోని ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో ఫ్లిన్ ఫిషర్, ఆమె సోదరుడు బర్టన్ ఉంటారు. వాళ్ల తల్లి క్యాన్సర్ తో ప్రాణాల కోసం పోరాడుతుంది. అయితే ఆమె ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు ఖర్చవుతుంది. అందుకోసం ఈ అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఆన్లైన్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తారు. ఫ్లిన్ కి అద్భుతమైన గేమింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇదంతా 2032లో జరుగుతుంది.
70 ఏళ్ల తర్వాత అంటే 2099 భవిష్యత్ కాలంలో… అంటే రెండు వేర్వేరు కాలాలలో కథ నడుస్తుంది. ఈ భవిష్యత్తు అంతా లండన్ నగరంలో ఉంటుంది. ఈ కాలానికి ముందే ప్రపంచంలో ది జాక్‌పాట్ అనే అతిపెద్ద విపత్తు జరిగి, జనాభాలో చాలా మంది చనిపోతారు. మిగిలిన ప్రపంచాన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక శక్తివంతమైన సంస్థ పరిపాలిస్తుంది. ఇక నుంచి సినిమా ఊహించని మలుపు తిరుగుతుంది.
ఓ రోజు బర్టన్ పేరు మీద ఒక సీక్రెట్ కంపెనీ నుంచి సరికొత్త అడ్వాన్స్ విఆర్ హెడ్సెట్ టెస్టింగ్ కోసం వస్తుంది. అయితే డబ్బు బాగా వస్తుందని ఆశతో బార్టన్ స్థానంలో ఆ హెడ్సెట్ పెట్టుకొని ఫ్లిన్ ఆ గేమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే.. అది గేమ్ కాదు నిజం. నగరంలోని ఒక రోబోటిక్ శరీరంలో ఆమె మేల్కొంటుంది. దీన్నే పెరిఫెరల్ అంటారు. మొదట్లో ఇదొక సాధారణ అడ్వాన్స్డ్ గేమ్ అని ఫ్లిన్ అనుకుంటుంది. కానీ క్వాంటం కంప్యూటర్ ద్వారా ఆమె నిజంగానే 70 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ప్రపంచంలో కనెక్ట్ అయిందని ఆ తర్వాత తెలుసుకుంటారు.
అయితే ఆ భవిష్యత్తు ప్రపంచంలో అలీటా వెస్ట్ అనే మహిళ సాయంతో ఒక పెద్ద ల్యాబ్ లోకి వెళ్లి, అక్కడి సీక్రెట్ డేటాను దొంగతనం చేస్తుంది. ఆ డేటా ఆమె నిజమైన మెదడులో సేవ్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న భవిష్యత్తు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ 2017లో ఉన్న హీరోయిన్ కుటుంబం మొత్తాన్ని చంపడానికి ఏర్పాటు చేస్తారు. హీరోయిన్ తో పాటు ఆమె అన్నయ్య తన కుటుంబానికి ఏం కాకుండా ఎలా కాపాడుకున్నారు ? భవిష్యత్తు ప్రపంచంలో ఉన్న విల్ప్ అనే వ్యక్తి ఫ్లిన్ కి ఇచ్చిన డీల్ ఏంటి ? ప్రస్తుతాన్ని నాశనం చేయాలి అనుకుంటున్న భవిష్యత్ వాళ్ళను హీరోయిన్ తన అన్నతో కలిసి ఎలా ఎదుర్కొంది ? అన్నది కథ. ఈ మూవీ Amazon prime videoలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా