Podarillu Today Episode October 11th : కన్నా వాళ్ల అమ్మను చూడగానే నారాయణ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. అసలు దీని గురించి నేను ఎందుకు చెప్పలేదు అన్నది మీకు ముందు ముందు తెలుస్తుంది ఇది ఒక జిత్తు మారి నక్క.. ఎవరూ లేదు కదా అని మనం ఆశ్రయమిస్తే మనల్ని ముంచేసిపోతుంది అంటూ నారాయణ ఆమెని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోడు. అయితే నువ్వు ఇంట్లోకి అడుగుపెడితే కాళ్లు విరగొట్టడం కాదు.. నీ ప్రాణం తీస్తాను అని నారాయణ ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. కానీ మాతో మాత్రం ఎన్ని రోజుల తర్వాత కరుణాకర్ తల్లి వచ్చింది కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు.. వెళ్ళు నాన్న ఇక్కడి నుంచి అని అంటాడు. దానితో నారాయణ మీరు దీన్ని ఎందుకు తీసుకొచ్చానా అని బాధపడతారు అనుభవిస్తారు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నారాయణ ప్రవర్తనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి.
ఆమెని లోపలికి తీసుకొని వెళ్తారు కన్న ఎక్కడా అని అందరూ వెతుకుతారు. అయితే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్న కన్నాని బయటకు రమ్మని పిలుస్తారు. కానీ చివరికి ఆమె వెళ్లి బయటకు రమ్మని తీసుకురాగానే కన్నా బయటకొచ్చి ఇన్నేళ్ల తర్వాత నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు అమ్మ.. ఇన్నేళ్లు నేను నీకు గుర్తుకు రాలేదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొన్ని పరిస్థితులు నన్ను కట్టిపడే సాయి అనాధగా ఉన్న నేను పసుపు పిల్లాడుగా ఉన్న నిన్ను తీసుకెళ్లి ఏ చెట్టు కింద కూర్చోబెట్టాలో అర్థం కాక వదిలేసి వెళ్ళిపోయాను. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను కదా నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను అంటూ అంటుంది. కన్నా బాధపడడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా బాధపడతారు. ఎపిసోడ్కి హైలెట్ సీన్ ఇదే అవుతుంది..
అసలు నువ్వెవరు మా ఇంట్లో సమస్యలను గురించి తెలుసుకునేందుకు.. నువ్వెందుకు దాన్ని తీసుకొని వచ్చావు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని దాన్ని తీసుకొని వచ్చావు అని నారాయణ అనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా ఫీల్ అవుతుంది. చాలా బాధ పడిపోతుంది కూడా. కన్నా బాధపడుతున్నాడు అని తీసుకొని వచ్చాను అని నారాయణతో అనగానే నువ్వు అలా తీసుకురావాల్సిన అవసరం ఏమి వచ్చింది. నేను చెప్పానా అది ఎలాంటిదో మీకు తెలియదు.. నేను చెప్పిన మీరు వినకుండా దాన్ని తీసుకొని వచ్చారు అది ఎంత ప్రమాదకరమో మీకే తెలుస్తుంది అని నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నారాయణ ఎందుకు ఇలా అన్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ కన్నా కోసం వాళ్ళ అమ్మ వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. కన్న సంతోషం ఇప్పుడు మనకు ముఖ్యం నారాయణ మళ్లీ వచ్చేసి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని అందరూ అనుకుంటారు.
కన్న వాళ్ళ అమ్మ వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు అని అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కన్న వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళ అమ్మ కానీ అమ్మ మొత్తానికి ఇంట్లోకి అడుగు పెట్టేసింది. చక్రి మహాలక్ష్మి ఫీల్ అవుతూ బయటికి వెళ్లడంతో తన దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు ఇక కన్నా వాళ్ళ అమ్మని చూసినా కేశవ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు మొత్తానికి ఎపిసోడ్ తల్లి కొడుకుల సెంటిమెంట్తో ఎమోషనల్ గా మారిపోతుంది. మొత్తానికి ఈ సీరియల్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో మరో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఇకముందు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
కన్నీళ్లు పెట్టుకున్న మహా..
మహా బయటకు వచ్చి చాలా ఫీల్ అవుతుంది. వెంటనే చక్రీ కూడా మహా వెంటనే వస్తాడు. నిజంగానే నాకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కదా.. నేనెవరో మీరెవరో అని చాలా ఫీల్ అవుతుంది. మీ ఇంటి సమస్యలు తీర్చడానికి నేను ఎవరు అంటూ మహా చాలా బాధపడుతుంది. అది చూసిన చక్రీ కూడా బాధపపడిపోతాడు. నారాయణ కూడా ఫుల్ గా తాగేసి చాలా ఫీల్ అవుతాడు. మా అమ్మను చాలా మాటలు అన్నాను నాకు బాధగా ఉంది. అమ్మ చాలా ఫీల్ అయ్యింది. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మొత్తానికి ఎపిసోడ్ మొత్తం సెంటిమెంట్ గా సాగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.