E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Podarillu Today Episode October 15th :మాధవ్ సైట్ కి వెళ్ళగానే మనీషా తన కోసం భోజనం తీసుకొని వస్తుంది. భోజనం వడ్డిస్తూ ఉండగా భన్సీ వచ్చి సైట్ కి ఇంజనీర్ గారు వచ్చారు బాయ్ అందుకే మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చాను అని చెప్పగానే అవునా ఇంజనీర్ గారు వచ్చారా? ఎక్కడున్నారు అంటూ మాధవ్ అడుగుతాడు. ఇక ఇంజనీర్ దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని అడుగుతాడు అయితే ఏడు లక్షలు కావాలి అని చెప్పడంతో అంత ఇవ్వడం కుదరదు నాకు తగినంత నేను సర్దుబాటు చేస్తాను అని అంటాడు ఆ మాట వినగానే మాతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మనీషా తన గాజులు తీసుకొని వచ్చి ఇస్తుంది. నేను ఏమీ అడగలేదు కదా నువ్వు ఎందుకు తెచ్చావు అని చెప్పగానే.. నేను మీ ఇంట్లో మనిషినే కదా తీసుకోండి అని మనిషా అంటుంది కానీ మాధవ్ మాత్రం తీసుకోడు.

తల్లి కోసం చక్రీ ఎమోషనల్..

చక్రి ఓంకారేశ్వర్ దగ్గరికి వెళ్లి తనకి ట్రిప్పులేస్తున్నాడని అడగాలని అనుకుంటారు. అన్నం అయింది.. అక్కడ ఓంకారేశ్వర్ కొడుకు ఉండడంతో అతనితో ఆడుకుంటాడు చక్రి . అటు కేశవ చక్రి ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఒక సందర్భంలో శైలు తన అదృష్టం అని చెప్పగానే కారు టైర్ పంచరవుతుంది దాంతో కేశవ షాక్ అవుతాడు. ఇక కన్నా తన తల్లితో మాట్లాడుతూ అసలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో కన్నా అడిగి తెలుసుకుంటాడు.. నారాయణ తనని బాగా భయపెట్టడం వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయానని ఆమె చెబుతుంది. దాంతో కన్నా నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు అని ఎమోషనల్ అయిపోతాడు. తనకి జమునకు కన్న బాగా దగ్గరవుతాడని అనిపిస్తుంది అంతేకాదు కన్నా జమునకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడంతో అది చూసిన జమున దీన్ని ఎక్కడ కొట్టుకోవాలి డబ్బులు అన్న ఇస్తే బాగుండేది అని అనుకుంటుంది. రాత్రి అందరూ సంతోషంగా భోజనం చేయాలని అనుకుంటారు.

నారాయణకు మాటతో షాక్..

Advertisement

రాత్రి అందరూ భోజనానికి రండి అని జమున అందరికీ భోజనం రెడీ చేసి తెలుస్తుంది.. అయితే అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు కానీ నారాయణ మాత్రం ఇంకా భోజనానికి రాకపోవడంతో అందరూ నారాయణ ఎక్కడ ఏంటి అని అడుగుతూ ఉంటారు.. నారాయణ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో మాకు తెలియదు. ఆయనతో మనకు పని లేదు అని కన్నా అన్న కూడా మాధవ్ మాత్రం నారాయణకు ఒకసారి ఫోన్ చేయాలి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే ఇంట్లో భోజనం ఉంటే నువ్వు బయట నుంచి ఎందుకు తెచ్చుకున్నావు అని అందరూ అడుగుతారు. కానీ నారాయణ మాత్రం అది వండింది. నేను తినను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అదొక మాయలాడి అని అనడంతో కన్నా సీరియస్ అవుతాడు.

నారాయణ దెబ్బకు జమున ఫ్యూజుల్ అవుట్..

అందరూ భోజనం చేసిన తర్వాత మాధవ్ వాళ్ళ అమ్మ గాజులని జమునకు ఇవ్వాలని తీసుకొని వస్తాడు. అమ్మ ఇవి మా అమ్మ గాజులు మీ చేతులు బోసిగా ఉన్నాయి కదా ఈ గాజులు మీరు వేసుకోండి అని తీసుకొని వస్తాడు. మా అమ్మ స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ గాజులు మీకే సొంతం అవుతాయి అని అనడంతో ఒక్కసారిగా నారాయణ సడన్గా ఎంట్రీ ఇచ్చి జమునకు దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. జమున ఒక దొంగది మోసగత్త అలాంటి దానికి మీ అమ్మ గాజులు ఇస్తావా.. ఆ దేవత గాజులు దీనికి ఇవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను అని నారాయణ అంటాడు. ఇస్తే మహాలక్ష్మికి గాని మనిషాకి గాని లేదంటే కేశవా ప్రేమించిన అమ్మాయికి గానీ ఇవ్వు అంతేకానీ ఇలాంటి దానికి ఇస్తే నేను అసలు ఊరుకోను అని అంటాడు. మీ నాన్నకి నా మీద ఇంకా కోపం పోలేదు ఆయన అంతే అని బాధ పడిపోతుంది జమున.

మహాకు దొరికిన జమున..

Advertisement

బంగారు గాజులు వచ్చినట్టే వచ్చి చేతులు జారిపోయాయి. నారాయణ ఇంక రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చి తింటే ఆ గాజులు నా సొంతమయ్యేవి. ఎటు లేదన్న కూడా అవి రెండు లక్షలకు పైగానే ఉండేవి అని జమున తనలో తాను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కన్నా లోపలికి వస్తాడు. కన్నా మాటలతో జమున విదేశాడా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. కానీ కన్నా మాత్రం మా నాన్న అన్నదానికి నువ్వేమీ బాధపడకు అమ్మ అంటూ అనడంతో వీడేమీ వినలేదు. వీడిని అడ్డుపెట్టుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఇక జమున తన భర్త ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది. డబ్బులు దొరకగానే ఫోన్ చేస్తాను అని చెప్పడంతో మహాలక్ష్మి ఆ మాట వింటుంది ఎవరితో మాట్లాడుతున్నారు డబ్బులు దొరికిన తర్వాత ఫోన్ చేస్తాను అని అన్నారు కదా ఎవరికీ అని అడుగుతుంది అయితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది..

సిగ్గుపడ్డ చక్రీ..

చక్రి సిగ్గు పడిపోతూ ఉంటాడు. ఏమైంది ఎందుకు సిగ్గుపడుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది మీరు కన్నా వాళ్ళ అమ్మతో ఏం చెప్పారు అందుకే నాకు సిగ్గేస్తుంది అని చక్రి మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అయితే నేను పెళ్లి గురించి మాట్లాడాను అంతే కదా అని మహాలక్ష్మి చెప్పగానే అదే అందుకే నాకు సిగ్గేస్తుంది అని అంటాడు.. మహాలక్ష్మి అనవసరంగా చక్రి దగ్గర బుక్కయ్య అనే ఆలోచిస్తూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో కేశవ కి అందరూ డబ్బులు ఇవ్వడంతో జమున వాటిని చూస్తూ ఉంటుంది.. అది చూసిన మహాలక్ష్మికి అనుమానం వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Related News

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

Big Stories

Advertisement
×