Podarillu Today Episode September 25th :మాధవ్ లోపలికి వెళ్లిన తర్వాత ఉదయం లేవగానే మహాలక్ష్మికి క్షమించమ్మా నేను కావాలని మాట్లాడలేదు. మనిషా ఫోన్ చేస్తేనే మాట్లాడాను అని చెప్తాడు. అయితే మాధవ్ అనడంతో మహాలక్ష్మి మిమ్మల్ని అనలేదు పెద్ది. మీరు మాట్లాడుతున్నారని కాదు వీడు నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు అని చాలా ఫీల్ అవుతున్నాడు అందుకే నేను అలా అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని మహాలక్ష్మి అంటుంది. చక్రీ అమ్మాయి తో మాట్లాడటం కూడా మీకు కోపంగా ఉంది కదా అని మాధవ అడుగుతాడు నాకేం కోపం లేదు పెద్ది తను ఎవరితో మాట్లాడుకుంటే నాకెందుకు అని అంటుంది.. ఇక పెద్ది కి చెప్పి కన్నా మహా ఇద్దరు కూడా స్కూటీ మీద బస్టాప్ కి వెళ్ళిపోతారు.
మహా కన్న ఇద్దరు బస్ స్టాప్ కి రాగానే అక్కడే ఉన్న గోపిక చక్రి ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి ఇంకా రాలేదు కదా ఒకసారి మహాలక్ష్మిని అడిగితే బాగుంటుందని సత్య సలహా ఇవ్వడంతో మహా అక్కడికి వస్తుంది. అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చిన గోపిక చక్రి ఎందుకు రాలేదు అని అడుగుతుంది అప్పటికే కాలుతున్న మహా మీ దగ్గర ఫోన్ ఉంది నెంబర్ ఉంది కదా చేసుకోవచ్చు కదా.. మీరు చక్రి తో పాటు వాళ్ళింట్లో నుంచి వస్తుంటారు కదా చక్రీకి మీరు ఏమవుతారు పక్కనే కదా అని గోపిక అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి. ఇక కాదు అత్త అనేసి కోపంగా అనడంతో గోపిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే చెక్రి రావడంతో కన్నా కచ్చితంగా దొరికిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మిని రెచ్చగొట్టిన చక్రి గోపికతో మాట్లాడడం చూసి చాలా కోపంగా ఉంటుంది. అయితే చక్రి చాలా కోపంగా ఉండడం చేసిన మహాన్నీ ఇంకా రెచ్చగొడతాడు..
కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి చక్రి తన కారులో వేసి పనిచేయలేదని తీసుకొని వెళ్తాడు. కేశవా కార్లో ఏసీ ని రిపేరు చేసిన తర్వాత అక్కడికి శైలు రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీకు ఇష్టమైన జ్యూస్ తీసుకొని వస్తాను అని చక్రి అంటాడు వెళ్లి జ్యూస్ తీసుకుని వచ్చేలోగా అక్కడ కేశవ తో శైలు గొడవ పడుతూ కనిపిస్తుంది ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారో ఏమైంది అని చక్రి అడుగుతాడు దానికి శైలు మీ అన్నయ్య పెళ్లికి నాకు సంబంధం ఉంది అని నన్ను దూరం పెట్టేస్తున్నాడు నేను ఎంత చేశాను మీకు తెలియదా మీరు నాకు న్యాయం చెప్పండి అని చక్రిని అడుగుతుంది శైలు. ఇద్దరు సమస్యలను పరిష్కరించి ఒకటే ఎలా చేస్తాడో చక్రి. కానీ చక్రి కి మాత్రం గోపిక ఫోన్ల మీద ఫోన్లు చేయడం చూసి ఏమైంది ఇంతగా కాల్ చేస్తుంది అని షాక్ అవుతాడు. అర్జెంటుగా కలవాలి మీరు రండి అని చక్రికి చెప్తుంది.
నాకు అర్జెంటు పని ఉంది అని చక్రి ఎంత చెప్తున్నా సరే గోపిక మాత్రం అస్సలు వినకుండా మాట్లాడాలి అని అర్జెంటుగా రమ్మని చెప్తుంది. ఇక చక్రి ఏమైందో ఏంటో అని అర్జెంటుగా రమ్మనింది కదా అని అక్కడికి వెళ్తాడు. అయితే గోపిక దగ్గరికి వెళ్ళిన చక్రి తనతో ఇష్టం లేనట్టే మాట్లాడతాడు. ఉదయం మీ వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారు.ఇప్పుడేంటి ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నారని గోపికకు అనుమానం వస్తుంది.. కాని చక్రి మాత్రం నాకు చాలా అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా అందుకే ఇలా ఉంది నేను వెళ్ళాలి అని చెప్తాడు. ఇవాళ నా బర్త్ డే మిమ్మల్ని స్పెషల్ గా పిలవాలి అని అనుకున్నాను.. సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి అని గోపిక చక్రిని పిలుస్తుంది. కానీ చక్రి మాత్రం నాకు చాలా వర్క్ ఉంది అని ఎంత చెప్తున్నారు సరే మీరు వస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పగానే అయస్టంగానే చక్రి సరే అని అంటాడు. ఇక తనని ఇంటిదగ్గర డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఓపికని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు చక్రి వెళ్తాడు. నేను మహాలక్ష్మికి ఉడికించడానికి తినక దగ్గరైతే తిను నామీద ఆశలు పెట్టుకుంటుంది అని చక్రి అనుకుంటాడు..
ఇంట్లోకి రాగానే మహాలక్ష్మి గేమ్స్ ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్న వాళ్ళని చూసి సీరియస్ అవుతుంది. కోసి గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది అని మహాలక్ష్మి చక్రిని అనగానే చక్రి విక్కిని ఏదో ఒకటి అంటూ ఉంటాడో దాంతో మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. మా గోపిక బర్తడే ఈ రోజు స్పెషల్ గా నన్ను రమ్మని పిలిచింది అని చక్రి చెప్పగానే మహాలక్ష్మి కాస్త సీరియస్ అవుతుంది. ఎలాగైనా సరే ఈరోజు గోపిక బర్తడే కి వెళ్ళాలి అని మహాలక్ష్మితో చెప్పగానే మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. అసలు ఇతను మారడు అని అనుకుంటుంది ఇక చక్రి గోపిక బర్త్డేకి ఎలాంటి షర్టు వేసుకొని వెళ్లాలి అని అడుగుతాడు కానీ ఎవరు సమాధానం చెప్పకపోవడంతో చక్రి రెడీ అయ్యి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు కానీ మహాలక్ష్మి చక్రి చొక్కా కొన్న గుండెలను తెంపేస్తుంది. అది చూసిన చక్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే చక్రి మహాలక్ష్మి పై అనుమానంతో ఎవరో కట్ చేశారు అని అనుకుంటాడు. చక్రి మరొక షర్ట్ వేసుకొని మహాలక్ష్మి దగ్గరికి వచ్చి మీకు ఏమైనా అసూయంగా ఉందా అని అడుగుతాడు కానీ మహాలక్ష్మి మాత్రం కోపం అని సమాధానం చెబుతుంది..
గోపిక తన బర్త్డేకి ఎంత ఏర్పాట్లు చేస్తూ ఉండగా బయట చక్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. చక్రి రాగానే గోపిక చాలా సంతోషంగా బయటికి వెళ్లి మీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను రండి అని చాలా సంతోషంగా చెప్తుంది గోపిక కానీ చక్రిమత్రం ఎలాగైనా సరే తనకు నిజం చెప్పి వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చక్రి లోపలికి వెళ్ళగానే గోపిక ఫ్రెండ్స్ అందరూ చక్రి తో చాలా సంతోషంగా మాట్లాడడం చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మొత్తానికి గోపిక అంత సంతోషంగా ఉండడం గోపిక ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు.. ఇక మొత్తానికి చక్రీ అడ్డంగా ఇరుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోసం అవని టెన్షన్.. పల్లవికి షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..