Shoaib Akhtar On Vaibhav Sooryavanshi: ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. తమ సొంత జట్టుకు వార్నింగ్ బెల్స్ పంపించాడు. వైభవ్ తుఫాన్ ను ఆపండి… లేకపోతే పాకిస్తాన్ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. వైభవ్ సూర్యవంశీని అస్సలు లైట్ తీసుకోకూడదని… వాడు పాకిస్తాన్ బౌలర్లను కోలుకోలేని దెబ్బ కొడతాడని హెచ్చరించారు. అతడి బ్యాటింగ్ పవర్, బ్యాలెన్సింగ్, హిట్టింగ్ అత్యంత ప్రమాదకరమైనవని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు షోయబ్ అక్తర్. వైభవ్ ను ఏ మాత్రం లైట్ తీసుకున్నా…అతడు పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడం కచ్చితంగా జరుగుతుందని హెచ్చరించారు.
15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ కు సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. జపాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడిని పక్కకు పెట్టిన గంభీర్… కచ్చితంగా ఏషియన్ గేమ్స్ లో ఓపెనర్ గా దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సంజు శాంసన్ పక్కకు వెళ్లాల్సి ఉంటుంది. వైభవ్ కాస్త క్లిక్ అయితే.. ఆపడం ఎవడి తరం కాదు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా తాజాగా వెల్లడించారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని తేలిగ్గా తీసుకోకూడదని కోరారు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంటులో వరల్డ్ క్లాసు బౌలర్ల అందరిని చీల్చి చెండాడినట్లు గుర్తు చేశారు షోయబ్ అక్తర్.
వాడికి పాకిస్తాన్ బౌలర్లు పెద్ద లెక్క కాదని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ కెప్టెన్సీ, కోచ్ ల గొడవలో PCB పడితే…15 ఏళ్ల ఆటంబాంబును వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తయారు చేసిందని వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు తన్నుకునే సమయంలోనే…. టీమ్ ఇండియా మరింత ముందుకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. ఇకనైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొద్దు నిద్ర లేవాలని కోరారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని ఎలా కట్టడి చేయాలని దాని పైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా వైభవ్ ను దెబ్బ కొట్టలేమని వెల్లడించారు. ఎలాగైనా టీమ్ ఇండియా అని ఓడించి పాకిస్తాన్ కు గోల్డ్ మెడల్ తేవాలని కోరారు.
ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన తమ క్వార్టర్ ఫైనల్స్ ఇతర జట్లతో పాకిస్తాన్ ఆడనున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీన ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి.