Podarillu Today Episode September 26th :నాకు అర్జెంటు పని ఉంది అని చక్రి ఎంత చెప్తున్నా సరే గోపిక మాత్రం అస్సలు వినకుండా మాట్లాడాలి అని అర్జెంటుగా రమ్మని చెప్తుంది. ఇక చక్రి ఏమైందో ఏంటో అని అర్జెంటుగా రమ్మనింది కదా అని అక్కడికి వెళ్తాడు. అయితే గోపిక దగ్గరికి వెళ్ళిన చక్రి తనతో ఇష్టం లేనట్టే మాట్లాడతాడు. ఉదయం మీ వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారు.ఇప్పుడేంటి ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నారని గోపికకు అనుమానం వస్తుంది.. కాని చక్రి మాత్రం నాకు చాలా అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా అందుకే ఇలా ఉంది నేను వెళ్ళాలి అని చెప్తాడు. ఇవాళ నా బర్త్ డే మిమ్మల్ని స్పెషల్ గా పిలవాలి అని అనుకున్నాను.. సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి అని గోపిక చక్రిని పిలుస్తుంది. కానీ చక్రి మాత్రం నాకు చాలా వర్క్ ఉంది అని ఎంత చెప్తున్నారు సరే మీరు వస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పగానే అయస్టంగానే చక్రి సరే అని అంటాడు. ఇక తనని ఇంటిదగ్గర డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఓపికని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు చక్రి వెళ్తాడు. నేను మహాలక్ష్మికి ఉడికించడానికి తినక దగ్గరైతే తిను నామీద ఆశలు పెట్టుకుంటుంది అని చక్రి అనుకుంటాడు..
గోపిక తన బర్త్డేకి ఎంత ఏర్పాట్లు చేస్తూ ఉండగా బయట చక్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. చక్రి రాగానే గోపిక చాలా సంతోషంగా బయటికి వెళ్లి మీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను రండి అని చాలా సంతోషంగా చెప్తుంది గోపిక కానీ చక్రిమత్రం ఎలాగైనా సరే తనకు నిజం చెప్పి వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చక్రి లోపలికి వెళ్ళగానే గోపిక ఫ్రెండ్స్ అందరూ చక్రి తో చాలా సంతోషంగా మాట్లాడడం చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మొత్తానికి గోపిక అంత సంతోషంగా ఉండడం గోపిక ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు.. ఇక మొత్తానికి చక్రీ అడ్డంగా ఇరుకుంటాడు.. అయితే మహాలక్ష్మిని ఆటపట్టించడానికి వచ్చిన చక్రీకి ఇలా ఇరుక్కుంటాడని అస్సలు ఊహించలేదంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రీ.. ఒకవైపు చక్రి తన నుంచి ఎలాగైనా దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించకపోవడంతో చక్రి ఆలోచనలో పడిపోతాడు. ఎలాగైనా సరే ఈ అమ్మాయి దగ్గరనుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి.
గోపిక చక్రినే తన లైఫ్ పార్ట్నర్ అని అందరిముందు రా చెప్పేస్తుంది ఆ మాట వినదు అనే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ అమ్మాయి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది నేను గనుక నిజం చెప్పకపోతే ఖచ్చితంగా తిను ఏమైనా చేసుకుంటుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు చక్రి. అప్పుడే చక్రి గోపిక చెయ్యి పట్టుకోగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు ఇక గోపిక అలా చెయ్యి పట్టుకుందో లేదో నాకు వాష్ రూమ్ వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. గోపికకి చెప్పకుండా వెళ్ళిపోవడంతో గోపిక ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడిపోతూ వస్తుంది.
మహా అందరూ కలిసి కూర్చుని తింటూ ఉండగా చక్రి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. కన్నా మొదటి నుంచి ఆమ్లెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ మాధవ్ మాత్రం అది చక్రి కోసం వేసిన ఆమ్లెట్ రా వాడు వచ్చి తింటాడు కదా అని చెప్తూ ఉంటాడు అప్పుడే చక్రి టైం కి వచ్చేసానా అయితే నాకు కూడా పెట్టు అన్నయ్య అని అంటాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బర్త్డే పార్టీ అని వెళ్లావు కదరా అక్కడ అన్నం కూడా పెట్టుకున్న కేకు స్నాక్స్ మాత్రమే పెట్టి పంపించారా ఏంటి అని కేశవ్ అంటాడు. స్టార్ హోటల్ రేంజ్ లో ఫుడ్ పెట్టారు కానీ నాకు మా అన్నయ్య ఫుడ్ అంటేనే ఇష్టం అని నేను వచ్చేసాను అని చక్రి చెప్తాడు. అంతేకాదు చక్రి గోపిక గురించి పొగుడుతూ ఉండగా మహాలక్ష్మి కాస్త సీరియస్ అవుతూనే వస్తుంది. అంత మంచి వాళ్ళైతే ఎందుకు వచ్చేసారు ఫుడ్ కూడా తినకుండా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అని సెటైర్ల వర్షం కురిపిస్తుంది.
మాధవ్ వంటగదిలో ఉండగా మహాలక్ష్మి తనకి సాయం చేస్తూ ఉంటుంది. మహా వంటగదిలో పని చేస్తూ ఉండగా కన్నా అన్నయ్య అంటూ సంతోషంగా వెనకాల నుంచి ఆఫ్ చేసుకుంటాడు. ఏమైందిరా ఎందుకు ఇలా సంతోషంగా వచ్చి వాటేసుకున్నావు ఏమైనా కావాలా ఈరోజు కాలేజ్ లేదా అని మాధవ్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. నాకు నువ్వంటే ఎప్పుడు స్పెషల్ అన్నయ్య. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అందుకే నేను కూడా సంతోషంగా ఉన్నాను అని మాధవ్ అంటాడు. కర్ణ ఆ మాట అనగానే డబ్బులు ఏమైనా కావాలా అని అడుగుతాడు మాధవ్. ఏంటి అన్నయ్య నేను నీ మీద ప్రేమతోనే వచ్చాను అంటే నువ్వు మాత్రం డబ్బులు అది అంటావు అని కన్నా చాలా ఫీల్ అవుతాడు. ఇక మహాలక్ష్మి తన ఫ్రెండు దివ్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండగా నారాయణ మాత్రం జ్వరంతో బాధపడడం చూసి చాలా బాధపడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..