E-Paper
Advertisement

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన
Advertisement

Bhuvanagiri District: చీటికి మాటికి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేటు బస్సులు మాత్రమేకాదు, ప్రభుత్వ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తు్న ఓ ట్రావెల్ ప్రమాదానికి గురైంది. అందులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రావెల్ బస్సు

శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద అతి వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. ఆ వేగంతో చెట్లలోకి దూసుకెళ్లింది  ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు. చౌటుప్పల్ దాటిన తర్వాత అప్పుడే చల్లటి గాలికి ప్రయాకులు నిద్రలోకి జారుకుంటున్నారు.

చౌటుప్పల్ వద్ద ఘోర  ప్రమాదం, స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

Advertisement

అతి వేగంతో వెళ్తున్న బస్సు స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. బస్సు మూమెంట్‌ గమనిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అప్పుడు బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. చాలామంది ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు తగిలినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే పోలీసులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ALSO READ: డీసీఎం ఢీకొని ఆరు పాడి గేదెలు మృతి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత!

Advertisement

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయాణికులతో మాట్లాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను ఎల్బీ నగర్ వద్దకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల కోసం అక్కడి నుంచి కొత్త బస్సులు వేసినట్టు సమాచారం. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

డీసీఎం ఢీకొని ఆరు పాడి గేదెలు మృతి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్!

కేసీఆర్ ప్రజల గుండెల్లో లేరు.. పామ్‌హౌస్‌లో దాక్కున్నారు! కేటీఆర్‌కి ఎమ్మెల్యే మురళీ నాయక్ కౌంటర్!

ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!

ప్రతి గ్రామానికి సొంత భవనం.. వేసవి తాగునీటిపై సీతక్క స్పెషల్ యాక్షన్ ప్లాన్!

మహిళను ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసాడు.. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు!

Big Stories

Advertisement
×