Suma kanakala: ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సుమా కనకాల(Suma kanakala). సినిమాల కంటే టెలివిజన్ రంగంలోనే భారీ సక్సెస్ అందుకుంది. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ హృదయాలను సొంతం చేసుకుంది. ఇటు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా కొనసాగుతున్న సుమ.. బుల్లితెర షోలు , ఇటు సినిమా ఆడియో లాంచ్ లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారింది. ఇకపోతే తన పని తాను చేసుకుంటూపోయే సుమ ఇంటికి తాజాగా పోలీసులు వెళ్ళనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రవర్సీకి దూరంగా ఉండే సుమ ఇంటికి పోలీసులు వెళ్లడం ఏంటి? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యాంకర్ సుమ ఇంటికి పోలీసులు.. అసలేమైందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. సుమ ఇంటికి పోలీసులు వెళ్లడానికి కారణం ఆమె భర్త రాజీవ్ కనకాల (Rajeev kanakala)అని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. రాజీవ్ కనకాల పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 421లో ఉన్న వెంచర్లో ఒక ఫ్లాట్ ను.. రాజీవ్ కనకాల సినీ నిర్మాత విజయ్ చౌదరి (Vijay Choudhary)కి విక్రయించారట. అటు విజయ్ చౌదరి ఆ ఫ్లాట్ ను మరో వ్యక్తికి రూ.70 లక్షలకు విక్రయించాడు. సదరు వ్యక్తి తన పేరు మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రయత్నం చేయగా.. అక్కడ అసలు ఫ్లాట్ లేదనే విషయం బయటపడింది. అసలు విషయాన్ని గ్రహించిన ఆ వ్యక్తి మోసపోయానని తెలుసుకొని.. హయత్ నగర్ లో చిత్ర నిర్మాత విజయ్ చౌదరి పై కేసు నమోదు చేశారు. ఇక కేసు నిమిత్తం విజయ్ చౌదరిని హయత్ నగర్ పోలీసులు ఆరా తీయగా.. అసలు నిజం బయటపెట్టారు విజయ్ చౌదరి.
లేనిది ఉన్నట్టు చూపించి భారీ మోసం..
విజయ్ చౌదరి మాట్లాడుతూ..”రాజీవ్ కనకాల వద్ద ఆ ఫ్లాట్ కొనుగోలు చేశాను అని.. అయితే రాజీవ్ కనకాల తమను మోసం చేశాడని, అక్కడ లేని ఫ్లాట్ ను ఉన్నట్టు చూపించాడని” రాచకొండ పోలీసులకు విజయ్ చౌదరి కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై రాజీవ్ కనకాలకు నోటీసులు అందించిన పోలీసులు.. ఇప్పుడు ఆయన ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఇంత మోసం చేస్తారని అనుకోలేదు.. లేని ఫ్లాట్ ను ఉన్నట్టు చూపించి భలే టోకరా కొట్టించారు.. మీరు మామూలు కిలాడీలు కాదయ్యో అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం పై సుమా దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
సుమా కనకాల కెరియర్..
బుల్లితెరపై వ్యాఖ్యాతగా పేరు సొంతం చేసుకున్న సుమా కనకాల క్యాష్, స్టార్ మహిళ, పంచావతారం, సూపర్ సింగర్, అవాక్కయ్యారా?, జీన్స్, భలే చాన్సులే, పట్టుకొంటే పట్టుచీర,లక్కు కిక్కు ఇలా పలు షోలకి హోస్టుగా వ్యవహరించి.. భారీ విజయం అందుకోవడమే కాకుండా స్టార్ మహిళ షో తో వేల ఎపిసోడ్లు కంప్లీట్ చేసి “లిమ్కా బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డు”లో కూడా స్థానం సంపాదించుకుంది.
అక్కడే రాజీవ్ కనకాలతో పరిచయం, ప్రేమ, పెళ్లి..
అటు సినిమాలు, షోలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించింది సుమ. తొలుత ‘మేఘమాల’ సీరియల్ చేస్తున్న సమయంలోనే ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల (Rajeev kanakala) తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లిగా మారి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈమె కొడుకు రోషన్ కనకాల(Roshan kanakala) కూడా హీరోగా సినిమా చేశారు.
ALSO READ:Fahadh Faasil: కీప్యాడ్ ఫోన్ వాడకంపై ఫహద్ కామెంట్.. ఏంటి సామీ నీ రియాక్షన్!