E-Paper
Advertisement

హమ్మయ్య.. పెళ్లెప్పుడో చెప్పేసిన ప్రదీప్..ఇక పీ పీ.. డుం డుం..

హమ్మయ్య.. పెళ్లెప్పుడో చెప్పేసిన ప్రదీప్..ఇక పీ పీ.. డుం డుం..
Advertisement

Pradeep machiraju:  బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep machiraju) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 40 ఏళ్లు వచ్చినా.. ఇంకా వివాహం చేసుకోకుండా వరుస బుల్లితెర షోలతో దూసుకుపోతున్నారు. గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా వంటి షోలతో హోస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ప్రదీప్.. 2014లో ఉత్తమ యాంకర్ గా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఢీ, సరిగమప వంటి షోలకి హోస్ట్ గా వ్యవహరించిన ప్రదీప్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగా కూడా 2 చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఈయన.. మొదటి సినిమాతోనే హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ప్రదీప్ పెళ్లి ఎప్పుడు?

ఇకపోతే కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ప్రదీప్ మాచిరాజు.. శ్రీ దేవీ డ్రామా కంపెనీ షో తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరొకవైపు ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే వరుస షో లు, సినిమాలు అంటూ దూసుకుపోతున్న ఈయన వ్యక్తిగతంగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
పైగా పెళ్లిచూపులు అనే ఒక కాన్సెప్ట్ కూడా నిర్వహించినప్పుడు ఈ ఏడాది ప్రదీప్ పెళ్లి అయిపోతుంది అని అందరూ అనుకున్నారు .అయినా అదంతా జరగలేదు ..
అయితే ఇప్పుడు తన పెళ్లి ఎప్పుడో చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రదీప్ మాచిరాజు.

ప్రదీప్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే – స్వప్న దత్

Advertisement

దసరా పండుగ రాబోతున్న నేపథ్యంలో దసరాకి విడుదల అనే ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా అందులో ప్రదీప్ , సుమా, ప్రముఖ నిర్మాత స్వప్నా దత్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ వంటి తారలు సందడి చేశారు. అంతేకాదు హోం మినిస్టర్ అనిత కూడా విచ్చేశారు. తర్వాత స్వప్న దత్ ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ లేడీ నిర్మాతగా భారీ క్రేజ్ అందుతున్న ఈమె స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ..” ఈ బుల్లబ్బాయిని బుల్లితెరకు పరిచయం చేసింది నేనే ” అంటూ ప్రదీప్ ఎంట్రీ పై ఊహించని కామెంట్లు చేశారు స్వప్న దత్.

also read: శివ్ బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

సంక్రాంతిలోపే పెళ్లి..

Advertisement

ఈయనే మా మేనమామ.. ఈయన తన కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తున్నారు అంటూ ప్రదీప్ షోలో కాన్సెప్ట్ గురించి వివరించగా.. స్వప్న దత్ మాత్రం.. నిజంగానే ఎప్పటినుంచో ఏ అమ్మాయి అని మేం కూడా చూస్తున్నాం అంటూ తన క్యూరియాసిటీని బయటపెట్టింది. ఇక ప్రదీప్ మాట్లాడుతూ “మేడం.. ఇది దసరా కదా.. సంక్రాంతి కల్లా ఏదో ఒకటి చేసేద్దాం” అంటూ సంక్రాంతి లోపు తాను పెళ్లి చేసుకోబోతున్నానని ఇన్ డైరెక్ట్ గానే చెప్పేశారు ప్రదీప్ మాచిరాజు. మొత్తానికైతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంకేమి ప్రదీప్ ఇంట్లో పీ పీ డుండుమే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Related News

భయమేస్తోంది అంటున్న విజయ్.. రష్మిక.. బయటకు కనిపించవు సుమీ!

మంగ్లీ బతుకమ్మ పాట రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం

ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

హీటెక్కిన నామినేషన్.. మళ్లీ నోరు జారిన రోహిత్..ఈ వారం?

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

Big Stories

Advertisement
×