E-Paper
Advertisement

జీరో To హీరో.. ఈవీ మార్కెట్ లో దుమ్మురేపుతున్న విన్‌ఫాస్ట్‌!

జీరో To హీరో.. ఈవీ మార్కెట్ లో దుమ్మురేపుతున్న విన్‌ఫాస్ట్‌!
Advertisement

Electric Car Sales July 2026: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెరుగుతుండటంతో చాలామంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు కొత్త కొత్త కంపెనీలు కూడా భారత ఈవీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా విడుదలైన జూలై 2026 అమ్మకాల రిపోర్టు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. జూలైలో దేశంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు కలిపి 32,214 వెహికల్స్ ను అమ్మాయి. జూన్‌లో ఈ కంపెనీల మొత్తం అమ్మకాలు 32,162 యూనిట్లుగా ఉన్నాయి. అంటే నెలవారీగా పెద్దగా మార్పు లేకపోయినా, అమ్మకాలు స్టేబుల్ గా కొనసాగాయి.

టాప్‌లో టాటా మోటార్స్

జూలైలో కూడా టాటా మోటార్స్ తన మొదటి స్థానాన్ని కొనసాగించింది. కంపెనీ మొత్తం 15,055 ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది. జూన్‌ లో 14,657 యూనిట్లను అమ్మగా, ఇప్పుడు పెరిగాయి. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ లాంటి మోడళ్లకు ఉన్న డిమాండ్ టాటా మోటార్స్‌ కు బలంగా మారింది. విస్తృతమైన ఈవీ లైనప్ ఉండటం కూడా కంపెనీకి కలిసొస్తోంది.

రెండో స్థానంలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ

Advertisement

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ జూలైలో 6,585 ఎలక్ట్రిక్ కార్లను అమ్మి రెండో స్థానంలో నిలిచింది. జూన్‌లో కంపెనీ అమ్మకాలు 5,971 యూనిట్లుగా ఉన్నాయి. అంటే.. ఒక్క నెలలోనే మంచి వృద్ధిని సాధించింది. కొత్త మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరగడం కంపెనీ అమ్మకాలకు జోష్ వచ్చింది.

మహీంద్రాకు మూడో స్థానం

మహీంద్రా జూలైలో 6,473 ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మి మూడో స్థానంలో నిలిచింది. అయితే జూన్‌లో 7,603 యూనిట్లు అమ్మిన కంపెనీకి జూలైలో అమ్మకాలు తగ్గాయి. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ తో మహీంద్రా టాప్ 3లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

విన్‌ ఫాస్ట్‌ కు అదిరిపోయే ఎంట్రీ

Advertisement

ఈ లిస్టులో అందరిని ఆకట్టుకున్న కంపెనీ విన్‌ఫాస్ట్. వియత్నాంకు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. జూలైలో ఏకంగా 2,426 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా జూలై 2025లో విన్‌ ఫాస్ట్‌ కు ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. కానీ, ఏడాది తిరిగేలోపే టాప్ 5లోకి రావడం విశేషం. జూన్‌ లో 1,928 యూనిట్లు అమ్మిన కంపెనీ, జూలైలో అమ్మకాలను మరింత పెంచుకుంది.

ఐదో స్థానంలో మారుతి సుజుకి

మారుతి సుజుకి జూలైలో 1,675 ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మి ఐదో స్థానంలో నిలిచింది. జూన్‌లో అమ్మిన 2,003 యూనిట్లతో పోలిస్తే ఈసారి సేల్స్ తగ్గాయి. మారుతి సుజుకి ప్రస్తుతం తన పోర్ట్‌ ఫోలియోలో ఒక్క ఎలక్ట్రిక్ మోడల్‌తో నే మార్కెట్‌లో ఉంది. అయినప్పటికీ టాప్ 5లో స్థానం సంపాదించడం విశేషం.

Read Also: టాటా నానో మళ్లీ వస్తుందా? అదీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో!

Tags

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×