BIGG BOSS 10: బిగ్ బాస్ అంటే పాపులారిటీ మాత్రమే కాదు ఎన్నో నిద్రలేని రాత్రులు.. ఖాళీ కడుపులు.. కుటుంబం కోసం పడే వేదన.. ఇలా ఎన్నో.. హౌస్ లో ఉన్న వారికే వీటన్నింటి విలువ కచ్చితంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బిగ్ బాస్ ఎప్పుడో ఒకసారి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ కంటెస్టెంట్స్ లో ఫుల్ జోష్ తీసుకొస్తూ ఉంటాడు. ఇష్టమైన వంటకాలను కళ్ళముందే పెట్టి.. ఊరించి.. తిన్నాక ఊహించని ట్విస్ట్ లు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి కడుపునిండా తిండి పెట్టి మరీ సడన్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్.
విషయంలోకి వెళ్తే.. తాజాగా 18వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో టేబుల్ నిండా రకరకాల పసందైన ఆహారాలతో నింపేసిన బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ కి ఊహించని ఆనందాన్ని కలిగించారు. తిండి చూడగానే సంతోషంతో అక్కడి వరకు వచ్చారు. కానీ మళ్ళీ బిగ్ బాస్ అనుమతి లేనిదే తినడం ఎలా అంటూ ఆగిపోయారు. నరేష్ మీరు పర్మిషన్ ఇస్తే తింటాం బిగ్ బాస్ అని అడిగాడు. ఆ తర్వాత ఇన్ని సీజన్లలో ఈ సీజన్ వారే భయస్తులని నేను అనుకుంటున్నాను అంటూ బిగ్ బాస్ చెప్పగా.. రాంప్రసాద్ మాట్లాడుతూ .. మనం భయస్తులం కాదని నిరూపించడానికి ఎవరో ఒకరు డేర్ స్టెప్ వేయండి అంటూ చెప్పగానే.. త్రిగుణ్ తనకు నచ్చిన ఐటమ్ తీసుకొని తినేసాడు. మిగతా కంటెస్టెంట్స్ కూడా అక్కడికి వెళ్లి స్వేచ్ఛగా తిన్నారు.. కొంతమంది దాచుకున్నారు కూడా.
అలా కడుపునిండా ఫుడ్ పెట్టిన బిగ్ బాస్.. ఒక్కొక్కరి గురించి, వాళ్ళ ఆట తీరు మెరుగుపరుచుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ చెబుతూనే..కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చాడు. ప్రోమో చివర్లో డోర్ ఓపెన్ అయినట్టు చూపించారు. దీంతో వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి సమయం ఆసన్నమైంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి..
మరొకవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా ముగ్గురు కామనర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ కి ముందు జరిగిన అగ్నిపరీక్ష సీజన్ 2 కార్యక్రమంలో టాప్ 15 లో ఒకరిగా నిలిచిన నవరసాలు రామకృష్ణ , మిథిలేష్ రెడ్డి, అపూర్వ పేర్లు ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీల విషయంలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ కి సంబంధించిన ప్రక్రియ మొదలైంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. అటు రామకృష్ణ, అపూర్వ, మిథిలేష్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళారని సమాచారం.
ALSO READ: సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా
దీంతో వీరి ఎంట్రీ పై బిగ్ బాస్ అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని చెప్పవచ్చు. ఈ ముగ్గురిని నేరుగా హౌస్ లోకి పంపిస్తారా ? లేదా వారికి ప్రత్యేకమైన టాస్కులు నిర్వహించి, ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మిథిలేష్ రెడ్డి దాదాపు కన్ఫామ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముగ్గురిని పంపిస్తారా లేదా మిథిలేష్ , అపూర్వలను హౌస్ లోకి పంపిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది