Bigg Boss 10 wild card: తెలుగు బిగ్ బాస్ సీజన్ కార్యక్రమం మూడవ వారం కూడా పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలోనే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ (Wild Card Entry) ఉంటుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి అయితే ఈ వార్తలకు అనుగుణంగానే ఈరోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ద్వారా ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది అయితే ఈ ముగ్గురు కూడా కామనర్స్ కావటం విశేషం. అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేసిన ఆరుగురు కంటెస్టెంట్లను ఇప్పటికే హౌస్ లోకి పంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మరో ముగ్గురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించారు ఇలా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన వారిలో మితిలేష్, రామకృష్ణ ,అపూర్వ ఉండటం విశేషం. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరు ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టకుండానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో వీరికి పెద్ద ఎత్తున గొడవ జరిగిందని చెప్పాలి. ఆటో రాంప్రసాద్, ముఖేష్ , త్రిగుణ్ గురించి కామనర్స్ కొన్ని మెసేజ్లు పెట్టిన సంగతి తెలిసిందే అయితే ఆ మెసేజ్లు పెట్టిన వారు ఎవరు అంటూ కూడా ఈ ముగ్గురు ప్రశ్నించారు దీంతో వైల్డ్ కార్డు ఎంట్రీస్ అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య గొడవ చోటుచేసుకుంది.
ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో గొడవ జరగడంతో నేటి ఎపిసోడ్ పై భారీగా హైప్ పెరిగింది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో హౌస్ లో పరిస్థితులు ఎలా మారుతాయి వీరికి ఆటతీరు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం నామినేషన్ లో 8 గురు కంటెస్టెంట్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఎవరు బయటకు వస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో వంశీ, సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
?stkn=MTY1dnN4cTh3dWxrOA%3D%3D
తాజాగా వెలువడుతున్న అన్‌అఫీషియల్ బిగ్ బాస్ ఓటింగ్ ట్రెండ్స్‌లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా మొదట్లో పెద్దగా ఓటింగ్‌లో కనిపించని సుధీర్ ఒక్కసారిగా రెండో స్థానానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.త్రిగుణ్, సుధీర్ ప్రస్తుతం మిగతా కంటెస్టెంట్ల కంటే ముందంజలో ఉండగా షాలిని, వంశీ, ఝాన్సీ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇంకా ఓటింగ్ కు సమయంలో ఉంది.కాబట్టి, ఓటింగ్ ట్రెండ్స్ ఎలా మారుతాయో వేచి చూడాలి.
Also Read: నమ్మండి.. సాయం చేశా, ఇదిగో ప్రూఫ్.. పాపం సాయి ధరమ్ తేజ్!