Tv Actor Prabhakar: బుల్లితెరపై నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు ప్రభాకర్(Prabhakar) ప్రస్తుతం పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రభాకర్ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. గత రెండు రోజుల క్రితం కంటెస్టెంట్ సృష్టి(shristi) మరొక కంటెస్టెంట్ సుధీర్ రెడ్డి(Sudheer Reddy) పట్ల వ్యవహరించిన తీరు అసలు ఏమాత్రం బాగాలేదని శాలిని వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారని ప్రభాకర్ సృష్టి వ్యవహార శైలిని తప్పుపడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా గత రాత్రి జరిగిన ఎపిసోడ్ కి సంబంధించి రివ్యూని ప్రభాకర్ తెలియజేస్తూ మరొక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈయన మాట్లాడుతూ.. రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది అంటూ ప్రభాకర్ మాట్లాడుతూ.. సృష్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని ప్రభాకర్ తెలిపారు. కం బ్యాక్ అంటే గేమ్ లో సుధీర్ పై గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయిందని మాత్రమే కాదు. ఆ తర్వాత సృష్టి రోహిత్ తో మాట్లాడుతున్న సమయంలో తన ఫేస్ లో అలాగే తన మనసులో పశ్చాత్తాపం కనిపించిందని ప్రభాకర్ తెలిపారు.
సృష్టి రోహిత్ తో మాట్లాడుతూ తప్పు చేశానని నాకే అనిపించింది ఈ రోజు ఉదయం కూడా నేనే వెళ్లి సుధీర్ ను మాట్లాడించానని చెబుతున్న సమయంలో సృష్టి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని ప్రభాకర్ తెలిపారు. మొత్తానికి ఆమె తప్పు చేసిందనే విషయాన్ని తెలుసుకున్నారు దాని గురించి తాను కం బ్యాక్ అని మాట్లాడాలని ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. గేమ్ కూడా బాగా ఆడిందని ఇలాంటి కం బ్యాక్ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ముందుకు వెళ్లచ్చని తెలిపారు.
?stkn=MTV0NDN0aGtjYzM2Yw%3D%3D
సృష్టి ఇలాగే ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఇంకా ముందుకు వెళుతుందని తెలిపారు. మన జీవితంలో కూడా మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తెలుసుకొని ముందుకు వెళ్లేవాడే కరెక్ట్ మనిషి అవుతారని ప్రభాకర్ తెలిపారు. మరో కంటెస్టెంట్ త్రిగుణ్(Trigun) గురించి మాట్లాడుతూ తను చాలా మారాలి అని తెలిపారు. చివరికి అమన్ మదర్ పంపిన బిర్యానీ తినడం పట్ల కూడా ఏడుస్తున్నాడని, త్రిగుణ్ వ్యవహార శైలి చాలా మారాలని ప్రభాకర్ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ ఇవ్వడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఈయన కూడా బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిపోయారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని హిట్టు కొట్టాడా? లేదా?