Pruthvi Raj on jabardasth show: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఇప్పటికీ విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూ గుర్తింపు పొందడమే కాకుండా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు. ఇలా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమం గురించి తాజాగా నటుడు పృథ్వీరాజ్ (Pruthvi Raj)చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలలో కామెడీ డైలాగ్స్ రాసేవారు వేరు ఉంటారు కానీ ఇక్కడ జబర్దస్త్ షోలో మాత్రం వాళ్లకు వాళ్లే స్కిట్లు రాసుకుంటారని ఇక్కడ స్కిట్ ఎలివేట్ అవ్వడం కోసం డబుల్ మీనింగ్ డైలాగులు పెడుతూ ఉంటారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ కానీ జడ్జిలు కానీ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటారు. ఏదైనా సెంటిమెంట్ డైలాగులు చెప్పినప్పుడు ఏడుస్తుంటారనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగిన కమెడియన్ కృష్ణ భగవాన్(Krishna Bhagavan) గారితో ఒకసారి తాను మాట్లాడుతూ ఏంటనయ్య జబర్దస్త్ జడ్జిగా ఎందుకు తప్పుకున్నారు అని ఒక సందర్భంలో అడిగితే బ్రదర్ మనకు కామెడీ వద్దు గానీ అక్కడున్నది ఎవరు కమెడియన్స్ కాదు అందుకే మానేశానని కృష్ణ భగవాన్ గారు చెప్పారని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. జబర్దస్త్ ఇంకా ఎంతోకాలం ఉండదని పృథ్విరాజ్ కామెంట్స్ చేశారు.
ఈ కార్యక్రమం మొదట్లో చాలా మంచి ఆదరణ వచ్చింది కానీ ఇటీవల కాలంలో ఈ షో కి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా బ్యాడ్ గా ఉందని తెలిపారు. ఈ షోలో అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో కూడా తెలియదు రకరకాల గెటప్స్ వేస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంటూ జబర్దస్త్ షో గురించి పృథ్విరాజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రస్తుత ఈ కార్యక్రమానికి ఇంద్రజ నాగబాబు జడ్జిలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ వంటి వారందరూ కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ షో సక్సెస్ ట్రాక్ ఎక్కేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పృథ్విరాజ్ చేసిన ఈ కామెంట్స్ పై జబర్దస్త్ టీం స్పందన ఏంటో తెలియాల్సి ఉంది.
?stkn=MTNsaWd2b29wMmk5NA%3D%3D
Also Read: ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?