Bigg Boss 10 Krishnudu: బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో సినీ నటుడు కృష్ణుడు(Krishnudu) ఒకరు. వెండి తెరపై పలు సినిమాలలో నటించిన ఈయన గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు. ఇకపోతే కృష్ణుడు ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో లేకుండా కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన హౌస్ నుంచి రావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.
ఇక రెండవ వారం కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఈ విషయం గురించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి(Aadi Reddy) కృష్ణుడు ఎలిమినేషన్ గురించి ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో ఈయన ఏం మాట్లాడకుండా కేవలం డాన్స్ వేస్తూ ఇప్పుడు బిగ్ బాస్10 (Bigg Boss 10) నుంచి కృష్ణుడు బయటకు రావడంతో ఆయన ఏమాత్రం బాధపడకుండా చాలా సంతోషంగా ఉంటారు అంటూ ఆదిరెడ్డి ఒక షార్ట్ వీడియో ద్వారా తెలియజేశారు అయితే ఈ విషయం గురించి ఇటీవల కృష్ణుడు ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆదిరెడ్డికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.
ఇలా ఆదిరెడ్డి గురించి కృష్ణుడు మాట్లాడుతూ తాను హౌస్ నుంచి హ్యాపీగా బయటకు వచ్చానని ఎవరు చెప్పారు? నేను ఆరోజు ఎంత ఎమోషనల్ అయ్యాను అనేది కంటెస్టెంట్లకు మాత్రమే తెలుసు అంటూ కృష్ణుడు తెలిపారు. తాను కూడా అందరిలాగే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం పాటు కొనసాగాలని వెళ్లాను కానీ నాకున్న అడిక్షన్ వల్ల నేను అక్కడ ఉండలేకపోయానని బిగ్ బాస్ వెళ్తే తన అలవాట్లు మారుతాయని వెళ్ళాను కానీ అది తనకు మైనస్ అయిందని కృష్ణుడు తెలిపారు. ఇక ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నువ్వు కూడా వ్యూస్ కోసం కాకుండా ఒకసారి ఆలోచించు.. నేను హౌస్ నుంచి బయటకు పోతే హ్యాపీగా గెంతుతున్నానని నువ్వు అనుకోవచ్చు కానీ అలాంటిదేమీ లేదు.
?stkn=MTIybTh0OWd4bjZuOA%3D%3D
నేను కూడా హౌస్ లోకి వెళ్లి బాగా పెర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్నాను కానీ పరిస్థితులు నన్ను అక్కడి వరకు తీసుకెళ్లలేదని, నా అలవాట్లు కారణంగానే బయటకు రావాల్సి వచ్చిందని కృష్ణుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు. హౌస్ లో ఉన్నది రెండు వారాలే అయినా వారితో చాలా మంచి బాండింగ్ ఏర్పడిందని వారందరినీ వదిలిపెట్టి రావడం కాస్త బాధనిపించింది అంటూ కృష్ణుడు తెలిపారు. మరి కృష్ణుడు ఎలిమినేషన్ గురించి ఆదిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈయన కౌంటర్ ఇచ్చారు. మరి ఆదిరెడ్డి నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఆదిరెడ్డి సీజన్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!