Rashmi Gautam : ఒకప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాలు చేసింది రష్మి గౌతమ్ (Rashmi Gautam). అయితే హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది. అలా మొదటిసారి జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) లోకి యాంకర్ గా అడుగుపెట్టిన రష్మి.. తనదైన మాటతీరుతో, అందచందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక్కడ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)తో రీల్ లవర్ గా పేరు కూడా దక్కించుకుంది. ముఖ్యంగా వీరిద్దరి జోడీ చూస్తే నిజంగానే వీరు రియల్ లైఫ్ లో కూడా లవర్స్ ఏమో అనేంత క్యూట్ గా ఉంటారు.
ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్..
ఇకపోతే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేసి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు బుల్లితెర షోలకి కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే రష్మి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama company) అనే షోకి కూడా రష్మినే యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక్కడ స్టాండ్ అప్ కమెడియన్స్ షోను నడిపిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది. అందులో కార్తీక పౌర్ణమి బ్యాక్ డ్రాప్ లో షోని ప్లాన్ చేశారు.
నా బాయ్ ఫ్రెండే.. మొగుడిగా రావాలని కోరుకున్న రష్మి
ఇక షోలో భాగంగా నీటిలో దీపాలను వదిలారు లేడీ కంటెస్టెంట్స్. ఆ సమయంలో రష్మి.. “ఓ మంచి దేవుడా.. నేను నా మనసులో ఎవరిని కోరుకుంటున్నానో.. వాడే నాకు మొగుడుగా రావాలి” అంటూ చెబుతుంది. “ఎవరిని కోరుకున్నావు..? ఎవరు వాడు..?” అంటూ రామ్ ప్రసాద్(Ram Prasad)అడగగా.. రష్మి కాస్త సిగ్గు పడిపోయింది. “అతడు ఎలా ఉంటాడు..?” అంటూ నూకరాజు అడగగా..”నాకు కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు” అంటూ చెబుతుంది. “అంతా కరెక్ట్ గానే చెప్పారు అది గుర్రం కాదు గోట్ ఏమో చూడండి” అంటూ ఇంద్రజ కూడా సెటైర్లు వేసింది. మరి రష్మిని వివాహం చేసుకోబోయే అదృష్టవంతులు ఎవరో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ రష్మి మనసు గెలుచుకున్న వరుడు సుధీర్ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
సుధీర్ కెరియర్..
సుధీర్ విషయానికి వస్తే.. పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన, ఆ తర్వాత 2019లో ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తర్వాత త్రీ మంకీస్ , కాలింగ్ సహస్ర, వాంటెడ్ పండుగాడు, గాలోడు వంటి చిత్రాలలో నటించారు సుధీర్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇక ఇప్పుడు రష్మీ కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచారు సుధీర్.