E-Paper
Advertisement

Kissik Talks:హీరోయిన్ గజాలతో విభేదాలు.. రేఖ రియాక్షన్!

Kissik Talks:హీరోయిన్ గజాలతో విభేదాలు.. రేఖ రియాక్షన్!
Advertisement

Kissik Talks:ఆనందం సినిమాతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రేఖ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె.. సడన్గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఇండస్ట్రీకి దూరమైంది. మధ్యలో బుల్లితెర షోలలో కనిపించిన ఈమె.. అప్పుడు గుర్తు పట్టలేనంతగా బక్క చిక్కిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక మళ్లీ కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే గజాలతో విభేదాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది

గజాలతో విభేదాలు.. రేఖ క్లారిటీ..

ప్రముఖ లేడీ జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన రేఖతో వర్షా మాట్లాడుతూ ..” గతంలో మీకు గజాలతో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. నిజమేనా? అంటూ ప్రశ్నించింది. దీనికి రేఖ మాట్లాడుతూ ..” గజాలతో నాకు విభేదాలా? అసలు ఈ విషయమే నాకు తెలియదు. అయినా ఎవరితో నేను గొడవ పెట్టుకోను. అసలు ఆ అవసరం నాకు లేదు. ఎవరైనా బహుశా పాపులారిటీ కోసం ఇలా చేసి ఉండవచ్చు. ముఖ్యంగా పి.ఆర్ కార్యక్రమాలు ఉంటాయి కదా అలా మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కల్పితం కథలు అల్లారేమో.. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కూడా మన మంచికే కదా.. ఇలాంటి వార్తలు వల్ల మనం మరింత వైరల్ అవుతాం” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది రేఖ. మొత్తానికైతే గజాలతో విభేదాలు అంటూ వచ్చిన వార్తలకు ఆమె ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది.

Advertisement

also read:Kissik Talks: మిస్ ఇండియా అవ్వాల్సిన ఆనందం రేఖ.. నటిగా మారడం వెనుక అంత కథ ఉందా?

ఉదయ్ కిరణ్ తో అనుబంధం..

ఇదే షోలో ఉదయ్ కిరణ్ తో బాండింగ్ పై స్పందిస్తూ పలు కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ..” నేను నటించిన తొలి చిత్రం ఆనందం సినిమాలో హీరోగా మొదట ఉదయ్ కిరణ్ నటించాల్సింది. కానీ అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో ఆకాష్ సరసన నటించాను. ఇక అలాగే కలుసుకోవాలని సినిమాలో కూడా నేను హీరోయిన్ గా చేయాల్సి ఉంది. కానీ నాకు కన్నడ సినిమా షెడ్యూల్ కారణంగా నేను ఈ సినిమా నుండి తప్పుకున్నాను. అలాగే రెండు మూడు చిత్రాలలో ఉదయ్ కిరణ్ తో నటించాల్సి ఉండగా.. ఇలా షెడ్యూల్స్ కారణంగా మిస్ అయ్యింది. ఇకపోతే ఆయనతో నాకు పెద్దగా బాండింగ్ ఏం లేదు. సినిమా అవకాశాలు మిస్ అయ్యాయి కాబట్టి ఆయనతో పరిచయం ఏర్పడలేదు అంటూ స్పందించింది రేఖా

Advertisement

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×