Ritu chowdary:రీతూ చౌదరి (Ritu Chowdary).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతలో అగ్గి రాజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారు చూపు తిప్పుకోనివ్వకుండా చేసే ఈ ముద్దుగుమ్మ, తాజాగా రూ.700 కోట్ల భూ కబ్జా స్కామ్ లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది..? సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టింది? ఈమె ఆస్తులు వివరాలు ఎంత? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
రీతూ చౌదరి బ్యాక్ గ్రౌండ్..
రీతూ చౌదరి తొలుత గోరింటాకు, అమ్మ కోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయింది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగుపెట్టి, తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. జబర్దస్త్ కి వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె, సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి గ్లామర్ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక రీతు చౌదరి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. రీతు చౌదరి మే 4న తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించింది. ఆ తర్వాత యూసఫ్గోడ సెయింట్ మేరీ స్కూల్లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. ఈమెకు జతిన్ అని ఒక సోదరుడు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటన రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న ఈమె, అందులో భాగంగానే లోకల్ చానల్స్ లో.. చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించేది. ఆ తర్వాత స్టార్ మా చానల్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే హోస్ట్ గా కూడా పనిచేసింది. అంతేకాదు ప్రదీప్, సుమా కాంబినేషన్లో వచ్చిన ‘ప్రదీప్ పెళ్లి చూపులు’ కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. అలా మొదటిసారి ‘ఆడదే ఆధారం’ అనే సీరియల్లో నటించింది. ఆ తర్వాత ‘గోరింటాకు’ సీరియల్ లో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు, ‘గిరిజా కళ్యాణం’ అనే సీరియల్ లో కూడా అవకాశం లభించింది. అలాగే జీ తెలుగులో ప్రసారమయ్యే రామసక్కని సీత, సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఈమె సీరియల్స్ లోనే కాదు తమిళ్ మూవీస్ లో కూడా నటించింది. తెలుగులో కూడా ‘మౌనమే ఇష్టం’ అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరికి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు.
రీతూ చౌదరి ఆస్తుల వివరాలు..
బుల్లితెరపై పలు షోలు చేస్తూ భారీగా పాపులారిటీ అందుకుని ఒక మోస్తారుగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె ఇటీవల తన ఇంటికి మరమ్మత్తులు చేయించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె పూర్తి ఆస్తుల వివరాలు బయటకు రావాల్సి ఉంది. కానీ అంతలోపే రూ.700 కోట్లకు సంబంధించి ల్యాండ్ కబ్జాలో పేరు వినిపించగా తనకు దానికి ఏం సంబంధం లేదని , ఒకప్పుడు ఏదో సంతకం పెట్టమంటే పెట్టాను అని, దానికి బినామీగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.