Bigg Boss 10 Jhansi: బిగ్ బాస్ సీజన్ 7 లోకి కామన్ మ్యాన్ కేటగిరిలో హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్ ను తగిలించుకొని.. అమర్దీప్ తో గొడవ పడి రైతుల సానుభూతిని సొంతం చేసుకొని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచారు అనే కామెంట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీజన్ 10 లో అదే రైతుబిడ్డ అనే ట్యాగ్ ను ఉపయోగిస్తూ.. ఆడియన్స్ సింపథీ కొట్టేసే ప్రయత్నం చేస్తోంది అంటూ ఝాన్సీ(Jhansi ) పై తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ నామినేట్ చేశారు చరణ్ (RJ Charan). మరి అసలు ఏం జరుగుతోంది ? నిజంగానే చరణ్ చెప్పినట్టు ఝాన్సీ పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఉపయోగిస్తోందా ? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
నిన్నటి ఎపిసోడ్ నామినేషన్స్ గమనిస్తే.. నామినేషన్స్ లో భాగంగా ఆర్జే చరణ్ తన నామినేషన్ లో ఝాన్సీని టార్గెట్ చేశారు. ఝాన్సీ కెప్టెన్ అయింది కదా మరి ఆమెను నామినేట్ ఎలా చేస్తారు అనే ప్రశ్న మొదలవచ్చు. కానీ స్టార్ ఆఫ్ ద వీక్ గా ముఖేష్ ఉండడంతో.. ఇతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ స్పష్టం చేశారు. అదే సమయంలో ముఖేష్ కారణంగా ఝాన్సీ టెన్షన్ కు గురైనట్టు భావిస్తే ఆమెను కూడా నామినేట్ చేయొచ్చని తెలిపారు. ఇక అందులో భాగంగానే ఆమెను నామినేట్ చేశారు చరణ్. చరణ్ మాట్లాడుతూ..” ఝాన్సీ నాతో మనస్ఫూర్తిగా ఉండడం లేదు. నాతో మాట్లాడుతున్న సమయంలో నిద్ర వస్తోందని చెప్పి వెళ్ళిపోయి మరో టీం తో మాత్రం సరదాగా మాట్లాడుతోంది. అలాగే గేమ్ లో ఎవరు నాకు సపోర్ట్ చేశారనే విషయాన్ని ఆమె ఇతరులకు చెప్పడం కూడా నాకు నచ్చలేదు..
మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించిన కండువా , షర్టును నామినేషన్స్ రోజే ఆమె ధరించడం ఇంకా నచ్చలేదు అని చెప్పడంతో ఝాన్సీపై చరణ్ పెట్టిన నామినేషన్ పాయింట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇకపోతే గతంలో పల్లవి ప్రశాంత్ కూడా ఇదే తరహా స్ట్రాటజీ ఉపయోగించారు. వీక్ మొత్తం ఒకలా.. తన ప్రవర్తనను చూపించే ఆయన నామినేషన్స్ వచ్చాయి అంటే.. కండువా ధరించి నామినేషన్స్ లో ఆడియన్స్ సింపథీ కొట్టేసేవాడు.. ఇప్పుడు సరిగ్గా ఝాన్సీ కూడా ఇదే చేస్తుండడంతో పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఇక్కడ ఈమె అప్లై చేస్తోందా అనే అనుమానాలు ఆడియన్స్ లో కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి నిజంగానే ఝాన్సీ కూడా అదే గేమ్ ఆడుతూ.. కప్పు కొట్టే దిశగా అడుగులు వేస్తోందా? అనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. చూద్దాం ఝాన్సీ ఆట తీరు ఏ విధంగా ఉండనుందో..
ALSO READ:15 ఏళ్ల తర్వాత నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వారి లిస్టు ఒకసారి గమనించినట్లయితే.. మూడవ వారం మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. అందులో ముఖేష్, త్రిగుణ్ , రోహిత్, వంశీ , షాలిని , సృష్టి, వర్షిణి , సుధీర్ .. ఇక వీరిలో సృష్టి లేదా సుధీర్ ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.