E-Paper
Advertisement

దసరా, దీపావళి ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. చర్లపల్లి నుంచి 38 స్పెషల్ ట్రైన్లు!

దసరా, దీపావళి ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. చర్లపల్లి నుంచి 38 స్పెషల్ ట్రైన్లు!
Advertisement

SCR Festive Special Trains 2026:  దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టై ప్రాంతాలకు అదనపు సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వైపు ప్రయాణించే వారికి అదనపు రైలు సదుపాయం అందుబాటులోకి రానుంది.

ప్రయాగ్‌ రాజ్‌కు ప్రత్యేక 20 సర్వీసులు

చర్లపల్లి–ప్రయాగ్‌రాజ్ మార్గంలో మొత్తం 20 ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాగ్‌రాజ్–చర్లపల్లి ప్రత్యేక రైలు నంబర్ 04121 సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ఈ మార్గంలో 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీనికి తిరుగు ప్రయాణంగా 04122 నంబర్ రైలు సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు నడుస్తుంది. ఈ సర్వీసు కూడా 10 ట్రిప్పులు అందిస్తుంది.

సెంగోట్టైకి 18 ప్రత్యేక రైళ్లు

Advertisement

చర్లపల్లి–సెంగోట్టై మధ్య 18 ప్రత్యేక సర్వీసులను సౌత్ సెంట్రల్ రైల్వే నడపనుంది. 07191 నంబర్ చర్లపల్లి–సెంగోట్టై రైలు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. మొత్తం తొమ్మిది సర్వీసులు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో 07192 నంబర్ సెంగోట్టై–చర్లపల్లి రైలు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. ఈ రైలు కూడా తొమ్మిది ట్రిప్పులు అందిస్తుంది.

ఏపీ మీదుగా ప్రయాణం

సెంగోట్టై ప్రత్యేక రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడుకు చేరుతుంది. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పొల్లాచ్చి, ఉడుమలైపేటై, పళని, దిండిగల్, మదురై, విరుదునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూర్, రాజపాళయం, శంకరన్‌కోవిల్, కడయనల్లూర్, తెన్కాసి వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది.

ప్రయాగ్‌రాజ్ మార్గంలో కీలక స్టాపులు

Advertisement

చర్లపల్లి–ప్రయాగ్‌ రాజ్ ప్రత్యేక రైళ్లు కూడా పలు ముఖ్య స్టేషన్ల మీదుగా నడుస్తాయి. మాణిక్‌పూర్, సత్నా, జబల్‌పూర్, ఇటార్సీ, బేతుల్, పాంధుర్నా, నాగ్‌పూర్, సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల్, కాజీపేటలో ఈ రైళ్లకు హాల్టింగ్ ఉంటుంది. రెండు దిశల్లోనూ ఈ స్టాపులు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక రైళ్లలో ఏ కోచ్ లు ఉంటాయంటే?   

సెంగోట్టై ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక రైళ్లలో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. పండుగల సమయంలో సాధారణ రైళ్లలో టికెట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అదనపు సర్వీసులు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి.

Read Also: గణేష్ నిమజ్జనం వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, రాత్రంతా స్పెషల్ MMTS రైళ్లు!

Tags

Related News

హోటల్ గదిలో రహస్య కెమెరాలు.. కచ్చితంగా చెక్ చేయాల్సిన 10 సీక్రెట్ ప్రదేశాలు!

కాజీపేట రైల్వే స్టేషన్ ఇక ఫుల్ మోడ్రన్.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

గణేష్ నిమజ్జనం వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, రాత్రంతా స్పెషల్ MMTS రైళ్లు!

రైడ్‌కు ముందు టిప్ ఎందుకు? క్యాబ్ యాప్‌ లకు కేంద్రం షాక్!

హోటల్లో అడుగుపెట్టగానే.. గదిని ఎందుకు ఫొటోలు తీయాలి? లేకపోతే జరిగే నష్టం ఏంటి?

ఒకే ఒక్క తప్పిదం.. ఎడారిలో ఏర్పడ్డ ‘బుల్లి సముద్రం’.. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

డ్రైవర్ అవసరం లేదు.. గంటకు 90 కి.మీ వేగం.. కొత్త మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×