Serial Hero : తెలుగు బుల్లితెర ఛానల్ స్టార్ మా లో ఎన్నో సక్సెస్ ఫుల్ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్టోరీ తో పాటు అందులో నటించిన నటీనటులు కూడా చక్కగా నటించడంతో ఆ సీరియల్ మంచి ఆదరణ దక్కించుకుంటుంది. అలాంటి సీరియల్స్ బుల్లితెర ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ఎన్నో ప్రసారం అవుతున్నాయి.. అందులో గతంలో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న ఎన్నెన్నో జన్మల బంధం ఒకటి. సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమాయ్యాడు యష్ (నిరంజన్).. ఆ సీరియల్ తర్వాత స్టార్ మా లో రీసెంట్గా సత్యభామ సీరియల్లో నటించాడు.. ఈ సీరియల్ కూడా ఇటీవలే పూర్తయింది. అయితే సీరియల్ ద్వారా ఎంతో మందిని నవ్వించిన యష్ జీవితంలో అన్ని కష్టాలే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆయన జీవితం గురించి ఎన్నో రహస్యాలను బయటపెట్టాడు..
యాక్టింగ్ రాదని అవమానించారు..
నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్.. అయితే గతంలో నేను యాక్టింగ్ చేస్తానంటే చాలామంది నవ్వారు అవమానించారు. అందుకే నా సొంత డబ్బులతో నేను షార్ట్ ఫిలింలు తీసి మంచి పేరును సంపాదించుకున్నాను అని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు సీరియల్ హీరో యష్.. నా కారు అమ్మేసి మరీ షార్ట్ ఫిల్మ్ చేశాను. కానీ దాని వల్ల నాకు మంచి పేరు రాలేదు. పోయిన చోటే వెతకాలని నేను.. నా ప్రయత్నం ఆపలేదు. ఒక మనిషిని ఈరోజు చూసి.. ఫ్యూచర్ ఎలా చెప్పేస్తారు.. ఎప్పుడు మనల్ని అవమానించే వల్లే మనల్ని టాలెంట్ నే బయటకు తీసుకొస్తారు. వలల అనడంతోనే మనం ఏదో ఒకటి సాధించాలనే కసిని మనలో నింపుకుంటాము.. ఇప్పుడు నేను అలానే కసితో సాధించాను హీరో అయ్యాను అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఒంటరిగా ఉండటం కష్టమే..
తెలుగులో సీరియల్స్ మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ తెలుగు ప్రేక్షకుల అభిమానంతో నేను ఇక్కడే సీరియల్స్ చేయాలని అనుకున్నాను అంటూ నిరంజన్ అంటున్నాడు. ఇక్కడ ఒంటరిగా ఉండాలి.. అది అంత ఈజీ కాదు. ఇంటికి రాగానే.. అమ్మ ఆప్యాయతని మిస్ అవ్వాలి.. అలసిపోయి వచ్చిన తరువాత పలకరించడానికి నా అనేవాళ్లు ఉండరు. ఉన్నావా? తిన్నావా? అని అడిగేవారు లేరు. ఇది నా భాష.. ఇది నాది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌తో అదే నిజం అయ్యింది అని అన్నాడు. ఇటీవల సత్యభామ సీరియల్ చేశాడు. ఇప్పుడు మరో రెండు సీరియల్స్ చేస్తున్నాడు.
Also Read: వినాయక చవితి స్పెషల్.. టీవీల్లోకి రాబోతున్న సూపర్ హిట్ చిత్రాలు..
నిరంజన్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
బుల్లితెరపై సంపాదిస్తున్న హీరోలు బాగానే రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారు. రోజుకి ఈ హీరో 35,000 వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే సీరియల్స్ కి లక్షలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.. తెలుగు సీరియల్స్ తో రెమ్యూనరేషన్ మాత్రమే కాదు.. బాగా ఫేమస్ కూడా అవుతారు..