Satyabhama Today Episode December 27 th: నిన్నటి ఎపిసోడ్ లో.. మైత్రి హర్ష కి కాల్ చేస్తే నందిని లిఫ్ట్ చేసి ఇంట్లో సమస్యలకు నువ్వే కారణమని ఇంకెప్పుడూ మాకు ఫోన్ చేయద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక మైత్రి హర్ష వాళ్ళ ఇంటికి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది. కానీ విశ్వనాథం మాత్రం ఆ డాక్యుమెంట్స్ మాకు వద్దమ్మా నీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయని చెప్తాడు. మైత్రి ఇంటికి వెళ్లి కోపంగా ఉంటుంది. విశాలాక్షి మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.. మైత్రిని ఇంకా రెచ్చగొట్టేలా తన ఫ్రెండ్ మాట్లాడడంతో చంపేస్తానని బెదిరిస్తుంది మైత్రి.. భైరవి సత్య గురించి నిజం చెప్తుంది. బాపు మనసు ఇబ్బంది పడేలా మాట్లాడి పోలీస్ స్టేషన్ గడప తొక్కిందని చాడీలు చెప్పి క్రిష్ ను రెచ్చ గొడుతుంది . క్రిష్ సత్యను అడిగి ఆ అశోక్ దగ్గరకు వెళ్తాడు. అతను మాట వినడు. మహాదేవయ్యతో మాట్లాడిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాపు కోసం నేను ఆగాను అంతే కానీ ముసలోళ్ళకి ఏమి చేయలేకపోతున్నానని క్రిష్ బాధపడుతూ ఇంటికి వస్తాడు. క్రిష్ గాని సత్య నా క్రిష్ ఏదైనా సాధించుకోస్తాడనేసి గొప్పగా చెప్తుంది.. కానీ క్రిష్ మాత్రం నేనేమీ చేయలేకపోయాను సత్య అనేసి అంటాడు. నువ్వు అనుకుంటే సాధించంది ఏముంది క్రిష్ మీ బాబుకి ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఆ నరసింహతో ఎంత గొడవకి దిగావో నీకు తెలుసు కదా ఇప్పుడు అంతకుమించి నువ్వు చేయగలవు కానీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు పదిమంది ముసలాలను కాపాడడం తప్పా క్రిష్ అనేసి క్రిష్ కి హితబోధ చేస్తుంది.. క్రిష్ బాపు కోసం ఆగాను తప్ప నేను చేయలేక కాదు నాకు సత్తువలేక కాదు అని సత్యతో అంటాడు. నీకు మీ బాపు అంటే భయం ఉంది అందుకే నువ్వు బాపుకి ఎదురు తిరిగితే ఏం చేస్తాడు అని భయంతోనే నువ్వు ఏం మాట్లాడకుండా వచ్చేసావు అది నిజం కదా క్రిష్ ఇప్పటికైనా ఒప్పుకో అనేసి రెచ్చగొడుతుంది..
మా బాపు అంటే లెక్క లేక కాదు మా బాపు మీద గౌరవంతోనే ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ విషయం ఏంటో తెలుద్దామని నేను ఆగాను తప్ప అంతకుమించి చేతకాక కాదు సత్యా అని క్రిష్ అరుస్తాడు.. లేదు క్రిష్ మీ బాపు చెప్పంది నువ్వు ఏది చేయలేవు అది మాత్రం నిజం. ఇప్పటికైనా నమ్ము ఒక మంచి పని కోసం తప్పు చేస్తున్నానని అనుకుంటున్నావు కానీ పదిమంది ముసలి వాళ్ళని ఎలా కాపాడుదాం అని నేను ఆలోచిస్తున్నాను నువ్వు ఆ రౌడీ కి భయపడవు నీ చేతిలో సత్తా ఉన్నా కూడా నువ్వు ఏమి చేయలేక తిరిగి వచ్చావు నువ్వే అర్థం చేసుకో అనేసి సత్య నిలదీస్తుంది.. నీతో పెట్టుకుంటే ఇది కాదు క్రిష్. నేను ఆ పెద్ద ఆవిడకు మాట ఇచ్చాను ఆ మాటను ఎలాగైనా నిలబెట్టుకోవాలి.. నీ చేతకాదని నాకు అర్థం అయిపోయింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఆ పెద్దావిడకు న్యాయం చేస్తానని క్రిష్ తో శపథం చేస్తుంది సత్య.. ఇంట్లో బాపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు నువ్వు మతుండి మాట్లాడుతున్నావా సత్య. మా బాపుకి పోటీగా ఎమ్మెల్యే అవుతున్నానంటున్నావు నీకు అర్థం అవుతుందా సోయాలో ఉండి మాట్లాడుతున్నావా అని సత్యను నిలదీస్తాడు క్రిష్. మీ బాపు చేతిలో అధికారం ఉంది అతనికి చెప్తే పోలీస్ కేసు పెడతాడు కానీ మీ బాపు చెప్పలేకపోయాడు నాకు అధికారం ఉంటే నేనే ఆ పని చేస్తాను కదా పదిమంది మంచి వాళ్ళకి మంచి చేశాను అనే సంతృప్తి నాకు ఉంటుంది అందుకే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాను అని శబదం చేస్తుంది సత్య..
నాకు ఇష్టం లేదు సత్య అనేసి క్రిష్ అంటాడు కానీ సత్య మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అని మొండిగా కూర్చుంటుంది నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను . క్రిస్ నేను మార్చుకోను అనేసి అంటుంది. అటు నరసింహ మహదేవయ్యను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంటాడు. మహదేవయ్యకు పలుకుబడి ఉంది. అతని చిన్న కోడలు చాలా తెలివైనది చాలా మొండిది. ఇక మొన్న గంగ చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది అలాకాకుండా ఏదైనా చిన్న గుట్టు దొరికితే చాలు ఆ మహాదేవయ్యను ఎలా ఓడించాలో నేను చూసుకుంటాను అనేసి నరసింహ తన మనిషితో మాట్లాడుతుంటాడు. ఇక ఉదయం లేవగానే క్రిష్ రెడీ అవుతాడు. సత్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన క్రిష్ తీసుకోడు. ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావ్ క్రిష్. ఎప్పటిలాగే మనం మొగుడు పెళ్ళాలుగా ఉండలేమా అని అడుగుతుంది. నువ్వేమో ఎమ్మెల్యే అవుతావు నేనేమో పనికిమాలినో అవుతాను అంటే మనం మొగుడు పెళ్ళాం ఎలా అవుతానో చెప్పు అనేసి క్రీస్తు అడుగుతాడు ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. సత్య ఎన్నిసార్లు క్రిష్ చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోనని మొండికేసి కూర్చుంటుంది. అలాగైతే మనిద్దరి మధ్య దూరం పెరుగుతుందని నేను ఆలోచించవా అని సత్యతో అంటాడు. ఇక ఏమి మాట్లాడకుండా కిందకు వచ్చేస్తాడు. మహదేవ లాయర్ తో ఎమ్మెల్యే ఫామ్ ను ఫిల్ అప్ చేయిస్తుంటాడు. జయమ్మకు ఈ ఫామ్ నీకు ఇస్తానమ్మా నువ్వు పూజ చేయించు అనేసి అనగానే పూజ ఏంట్రా నువ్వు ఎమ్మెల్యే గెలుస్తానని 100 కొబ్బరికాయలు కొడతానని అంటుంది. మీ మంచి కోరే వాళ్ళ చేత్తో సైన్ చేయించండి అనేసి లాయర్ అంటాడు. అప్పుడే సత్య కిందకి వస్తుంది. సత్య నువ్వు సైన్ చెయ్ అమ్మ నీ చేయి చాలా మంచిది నీకు పట్టుచీర కొని పెడతానని అంటాడు. మరి బైరవి నాకు పెనిమిటి అని అడిగితే నీకెందుకు కొనిపించకుండా ఉంటాను నీకు కూడా కనిపిస్తానని అంటాడు.. దానికి క్రిష్ సత్య సైన్ చేయదు బాపు అనేసి అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.