BigTV English

2023-24 BJP Donations : బిజేపీకి రూ.2600 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్‌కు రూ.281 కోట్లు మాత్రమే.. ఈసీ నివేదిక

2023-24 BJP Donations : బిజేపీకి రూ.2600 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్‌కు రూ.281 కోట్లు మాత్రమే.. ఈసీ నివేదిక

2023-24 BJP Donations | 2024 లోక్ సభ ఎన్నికలక సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ 42 గణాంకాల నివేదికలు విడుదల చేసింది. వీటితో పాటు 2024లోనే జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన 14 నివేదికలు కూడా విడుదల చేసింది. ఈ నివేదికలలో ముఖ్యమైనది పార్టీలకు అందిన విరాళాల రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 2023-24 సంవత్సరానికి గాను మొత్తం రూ.2,604.74 కోట్లు అందాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ కు రూ.281.38 కోట్లు మాత్రమే అందాయి.


ఈ విరాళాల సమాచారం లోక్ సభ ఎన్నికలకు ముందు మార్చి 31, 2024 సమయం వరకు మాత్రమే సంబంధించినది. అయితే అంతకుముందు జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో బిజేపీ కేవలం రూ.740 కోట్లు ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం రూ.146 కోట్లు మాత్రమే ప్రకటించింది.

Also Read: 2024లో మారిన ప్రపంచ రాజకీయాలు.. ఏ దేశంలో ఏం జరిగిందంటే..


2023-24 కాలానికి బిజేపీకి అందిన పార్టీ చందాలో రూ.723 కోట్ల విరాళాలు ఒక్క ప్రూడెంట్ ఎలెక్టోరల్ ట్రస్టు ద్వారానే వచ్చాయి. ఇవికాక మరో రూ.127 కోట్లు ట్రయంఫ్ ఎలెక్టోరల్ ట్రస్ట నుంచి రూ.17 లక్షలు ఎయిన్‌జిగార్టిగ్ ఎలెక్టోరల్ ట్రస్టు నుంచి అందాయి. కాంగ్రెస్ అందిన విరాళాలలో ఎక్కువగా అంటే రూ.150 కోట్లు ప్రూడెంట్ ఎలెక్టోరల్ ట్రస్టు నుంచే వచ్చాయి. వీటితో పాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, దిగ్విజయ సింగ్ లాంటి నాయకులు కూడా పార్టీకి లక్షల్లో విరాళాలు అందించారు.

అయితే బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలియజేసిన విరాళాలలో ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినవి కావు. ఎందుకంటే ఎలెక్టోరల్ బాండ్స్ ఆడిటింగ్ సమయంలోనే బహిర్గతం చేయాలి.

ఇక దేశంలో మూడో అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.11.06 కోట్ల విరాళాలు అందాయని అధికారిక సమాచారం. జాతీయ పార్టీలలో కమ్మూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్‌సిస్టు పార్టీకి మాత్రం రూ.7.64 కోట్లు అందాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) కూడా రూ.14.85 లక్షలు విరాళాలు ప్రకటించింది.

ఇక ఎలెక్టోరల్ బాండ్స్ విషయానికి వస్తే.. వేదాంత, భారతి ఎయిర్ టెల్, ముథూట్, బజాజ్ ఆటో, జిందాల్ గ్రూప్ర, టివిఎస్ మోటార్స్ లాంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు ఎక్కువగా బిజేపీకి ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా భారీ విరాళాలు అందించాయి. ఇక లాటరీ కింగ్ గా దేశంలో పేరొందిన శాంటియాగో మార్టిన్ కు చెందిన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా బిజేపీకి రూ.3 కోట్ల పార్టీ విరాళం అందింది. ఈ శాంటియాగో మార్టిన్.. మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను శాఖ విచారణ ఎదుర్కొంటున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రాంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కు కూడా ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళాలు ఇచ్చింది. ఈ కంపెనీ టిఎంసి కి రూ.542 కోట్లు, తమిళనాడులో డిఎంకె పారటీకి రూ.503 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో అప్పటి అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సిపికి రూ.154 కోట్లు విరాళాలు ఇచ్చింది.

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×