Satyabhama Today Episode December 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. గంగ గురించి అడగటానికి మహాదేవయ్య దగ్గరకు క్రిష్ వెళ్తాడు. కానీ క్రిష్ తో మాట్లాడటానికి మహాదేవయ్య ఇష్టపడడు.. బాపు నీ కోపం ఏందో చెప్పు బాపు అనేసి అడుగుతాడు. క్రిష్ ని చూడగానే మహదేవయ్య ఏం లేదు అని కోపంగా కసురుకుంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. ఏంటి మళ్లీ బాపు కోపంగా ఉన్నాడని క్రిష్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. సత్య వెళ్లి క్రిష్ ఏంటి చిన్నపిల్లల బాధపడుతున్నావు మీ నాన్న మనసులో ఎంత బాధ ఉంటే అలా అంటాడు మీరు మాట్లాడుకునేదంతా నేను విన్నాను అనేసి అంటుంది. బాపు నిజంగానే తప్పు చేశాడా? అనుకుంటున్నావ్ సత్యా అంటే ఏమో ఆయన కూడా ఒక మామూలు మనిషే కదా ఏదైనా జరగొచ్చు ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయనే అనుమానం కలిగిస్తుంది. మైత్రి నందిని, హర్షాలను విడకోట్టాలని ప్లాన్ వేస్తుంది. ఇక భైరవి నగలన్నీ గంగ ధరించి ముచ్చట పడుతుంది. ఆ నగలని వేసుకుంటే మహాలక్ష్మి లా ఉన్నానని మురిసిపోతూ ఉంటుంది. గంగను చూసి బైరవి షాక్ అవుతుంది. ఇద్దరి మధ్య వాదన పెరుగుతుంది. సత్య ఎంట్రీతో ఇద్దరి మధ్య గొడవ కాస్త పెరుగుతుంది. ఇక సత్యా రేపటి రిపోర్ట్స్ వచ్చేంతవరకు నువ్వు బుద్ధిగా ఉండు. అసలు నిజం బయటికి వచ్చిన తర్వాతే ఈ వాదనలన్నీ ఉంటాయి అనేసి గంగకి చెప్తుంది. నువ్వేదైనా తేల్చుకోవాలన్న మాట్లాడాలన్నా అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అనేసి గంగకి చెప్తుంది. ఇక సత్య నన్ను అడ్డంగా ఇరికించిందని మహదేవయ్యా ఆలోచిస్తుంటాడు. తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తాడు. కానీ రిపోర్ట్స్ మార్చడంలో ఎవ్వరు సహాయం చెయ్యరు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అప్పుడే సత్య అక్కడికి వస్తుంది. ఎవరు హెల్ప్ చెయ్యకుండా ఉన్నారా? నేను హెల్ప్ చేస్తాను అంటుంది. ఏంటి నేనే గోతిలోకి తోసేసి నేనే పైకి తీస్తా అంటున్నా అని అనుకుంటున్నారా? అవును.. కానీ కొన్ని కండీషన్లు ఉన్నాయి అని సత్య అంటుంది. మీ పచ్చబొట్టు కొడుకును మీ రూమ్ లోకి తీసుకొస్తాను మీరు బిడ్డలు మార్పిడి గురించి అసలు విషయం చెప్పండి అనేసి అడుగుతుంది పరిస్థితుల్లో మీరు బిడ్డలని మార్పిడి చేశారన్న విషయం మీరు క్లియర్ గా చెప్తే మీ ప్రాణానికి నా ప్రాణాలు అడ్డేస్తానని సత్య మహదేవయ్యతో అంటుంది. ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మిస్ చేసుకోకండి అని సత్యం అంటుంది. కానీ మహదేవయ్య నా చెవుల్లో ఏమన్న పువ్వులు ఉన్నాయా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక క్రిష్ గంగ ఎవరు? ఇలా చేస్తున్నారు ఈ గంగా వెనకాల ఎవరున్నారు అనేది తెలుసుకోవాలని అనుకుంటాడు? ఇంక బ్యాగ్ ని చెక్ చేస్తే సరిపోతుందని లోపలికి వెళ్తాడు. గంగా తన బ్యాగ్ ని తన తలకిందే పెట్టుకుని పడుకోవడం చూసి షాక్ అవుతాడు.. ఇక మొత్తానికి గంగ బ్యాగ్ తీసుకొని క్రిష్ చెక్ చేస్తాడు. బ్యాగ్ లో క్రిస్ చిన్నప్పుడు ఫోటో ఉంటుంది అది చూసి షాక్ అయిన క్రిష్ అసలు ఎవరు ఈమె అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు..
తన చిన్నప్పుడు ఫోటోలు తీసుకుని బయటకు వచ్చేస్తాడు క్రిష్.. క్రిష్ ఫోటో తీసుకోవడం సత్య చూస్తుంది. నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని మీ చిన్నప్పుడు ఫోటో ఆ బ్యాగ్ లో పెట్టాను అనేసి ఉంటుంది సత్య. ఇక క్రిష్ ఫోటో పట్టుకొని చూస్తున్నప్పుడు సత్య క్రిష్ దగ్గరికి వచ్చి ఈ ఫోటో నీది చిన్నప్పుడుది కదా అనేసి అంటుంది. ఇప్పటికన్నా చిన్నప్పుడే నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని క్రిష్ కి ముద్దు పెడుతుంది. ఇది ఈ ఫోటో ఎలా చిన్న తెలుసా అనేసి క్రిష్ అంటాడు. గంగ బ్యాగ్ లో ఉందని అంటుంది. గంగ దగ్గరికి ఫోటో ఎలా వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు ఇచ్చారు అనేసి క్రిష్ అనగానే, సత్య మావయ్య ఇచ్చారేమో అనేసి అంటుంది. ఇది నీకెందుకు అంత అనుమానం ఏంటి? నువ్వు ఊరికే బాపు నీది చేస్తున్నావనేసి క్రిష్ కోప్పడతాడు.. ఒకవైపు ఆలోచించడమే కాదు అటువైపు కూడా ఆలోచించు క్రిష్ అనేసి సలహా ఇస్తుంది. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ సీన్ జరుగుతుంది.
ఇక హర్ష కు మైత్రి ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. రేపు మైత్రి బర్త్ డే గుర్తుందా అని అంటుంది. రేపు బర్త్ డే కి వస్తున్నావా అని ఆడుతుంది. వస్తానని అని చెప్తుంది. అప్పుడే నందిని స్వీట్ చేసినా అని తీసుకుని వస్తుంది. నువ్వు ఓకే కొడితే నేను ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేస్తాను అనేసి అంటుంది. ఇంతకుముందు ఫోన్ చేసింది ఎవరు అనేసి అనుమానం పడుతుంది. ఇక క్రిష్ గంగ ఎవరు? నరసింహమే గంగని ఇంట్లోకి తెచ్చాడెమో అనేసి అనుమాన పడతాడు. క్రిష్ నరసింహకు ఫోన్ చేస్తాడు. నరసింహని పంపించాడని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గంగ ని పంపించింది నరసింహ కాదని తెలుసుకుంటాడు.. ఇక ఉదయం లేవగానే సంధ్యకు సంజయ్ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఇక డీఎన్ ఏ రిపోర్ట్స్ వస్తాయి. సత్య ఓపెన్ చేస్తూ ఉంటే నరసింహ అక్కడికి మీడియాను తీసుకొని వస్తాడు. నీతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో నరసింహ తీసుకు వచ్చిన డాక్టర్ తోనే డిఎన్ఏ రిపోర్ట్ ను ఓపెన్ చేస్తారు. అందులో మహదేవయ్య క్రిష్ తండ్రి అని ఉందా లేదా అనేది రేపు తెలియనుంది..