Jagdeep Dhankhar Farmers| దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులతో ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్చలు చేపట్టలేదని నిలదీశారు. ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా ప్రాంతం నుంచి రైతులు ర్యాలీ చేపట్టిన మరుసటి రోజే ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ముంబై నగరంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ (CIRCOT) సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ముఖ్య అతిథి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. “దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) వ్యవసాయ పరిశోధన సంస్థలు ఉన్నా.. రైతులు కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం, రైతుల మధ్యపై ఒక బౌండరీ ఏర్పాటు చేయడం కరెక్టేనా? ఇప్పటివరకు రైతులతో ప్రభుత్వం ఎందుకు చర్చలు చేపట్టలేదో? నాకు అర్థం చేసుకోలేకపోతున్నాను. నా బాధేంటేంటే.. ప్రభుత్వం ఎందుకు ముందడగు వేయడం లేదు.” అని ప్రశ్నించారు.
దేశంలో రైతుల సమస్యల పట్ల అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఆ కార్యం కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టాలని ఆ సూచించారు. ఒకప్పుడు దేశంలోని అన్ని రాజ్యాలను ఏకీకృతం చేసిన సర్దార్ వల్లభాయ పటేల్ ని ఆదర్శంగా తీసుకొని శివరాజ్ సింగ్ చౌహాన్ పనిచేయాలని.. ఈ కార్యాన్ని ఒక సవాలుగా స్వీకరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతులతో కేంద్ర ప్రభుత్వం తరపున ఇంతకుముందు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏం వాగ్దానాలు చేశారో.. ఆ వాగ్దానాలు పూర్తి చేశారా? పూర్తి చేయకపోతే ఇంతవరకు ఏం చేశారు? అని జగదీప్ ధనకర్ నిలదీశారు.
Also Read: జస్టిస్ చంద్రచూడ్ వల్లే మసీదు, దేవాలయం గొడవలు.. ఒవైసీ మండిపాటు
ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం పేరు మార్మోగిపోతోందని.. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయని గుర్తు చేశారు. “ప్రపంచ దేశాలన్నీ భారతదేశంవైపు చూస్తున్నాయి. ఈ సమయంలో దేశంలోని రైతుల కొచ్చిన సమస్యలేంటి? వాళ్ల కష్టాలేంటి? ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారు? అని అందరూ ప్రశ్నిస్తారు. ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే.. ప్రభుత్వం చేపడుతన్న విధానాలు, పథకాలు సరైన దిశలో లేవనే అర్థం. రైతుల గొంతుక దేశంలోని ఏ శక్తి అణచివేయలేదు. రైతులకు ఓపిక నశిస్తే.. దేశాని చాలా నష్టం. దేశం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.” అని ఉపరాష్ట్రపతి(Jagdeep Dhankhar) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంగళవారం ఉదయం నిరసన చేస్తున్న రైతులు.. తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, పంటకు సరైన పరిహారం చెల్లించాలని డిమాండ చేస్తూ ఢిల్లీ వైపు ర్యాలీలో వెళుతుండగా.. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అన్నదాతలను అరెస్టు చేశారు. నోయిడాలోని రాష్ట్రీయ దలిత్ ప్రేరణా స్థల్ వద్ద రైతలు నిరసన చేస్తుండగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధరతో సహా భారీ సంస్కర్ణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. భారతీయ కిసాన్ పరిషద్ నేతృత్వంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి.
Also Read: దేశంలో బడా వ్యాపారులే లాభపడుతున్నారు.. పేదలు కాదు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
అంతకుముందు సోమవారం కూడా రైతులు ఢిల్లీ చలో నిరసన చేస్తూ ఉండగా.. వారిని బ్యారికేడ్ల వద్ద పోలీసులు అరెట్టు చేశారని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయెత్ తెలిపారు. రైతుల నిరసనలతో ఢిల్లీ సరిహద్దుల వద్ద ప్రజలకు రాకపోకలు చేసేందకు ఇబ్బంది కలుగుతోందని ఢిలీ పోలీసులు తెలిపారు.
#WATCH | Mumbai: Vice President Jagdeep Dhankhar says, "Can we create a boundary between the farmer and the government? I do not understand why there is no dialogue with the farmers…My concern is why this initiative has not happened so far. You (Shivraj Singh Chouhan) is the… pic.twitter.com/hgT1KLk3KJ
— ANI (@ANI) December 3, 2024