Satyabhama Today Episode December 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. డీఎన్ఏ రిపోర్ట్ మహాదేవయ్యకు అనుకూలంగా రావడంతో సత్య షాక్ అవుతుంది. ఇక మహాదేవయ్య గెలిచాడని సంబరపడిపోతాడు. సత్యను దారుణంగా అవమానిస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి సత్యకు ఫోన్ చేసి క్రిష్ పుట్టినప్పుడు పనిచేసిన నర్స్ అడ్రెస్ దొరికిందని చెబుతాడు. దాంతో సత్య మళ్లీ మహాదేవయ్య దగ్గరకు వెళ్లి గెలుపు నీ ఒక్కడి సొంతం అనుకోవద్దు. నాకు ఒక రోజు వస్తుంది అని చెప్తుంది. ఇక ఆ నర్స్ ను కలిసి అసలు సినిమా బయట పెట్టాలని అనుకుంటుంది. ఇక సత్య, క్రిష్ లు సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. క్రిష్ సెటైర్లకు, సత్య కౌంటర్స్ వేస్తుంది. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ కార్లో వెళ్తూ ఉంటారు. ఇక గంగ గురించి క్రిష్ ప్రస్థావిస్తే సత్య తడబడుతుంది. ఆమె నీకు చెడు ఏం చేయలేదు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఆమె గురించి మర్చిపోవచ్చు కదా అనేసి సత్య అంటుంది. కానీ క్రిష్ మాత్రం ఆమె వెనకాల ఎవరో ఉన్నారు లేకుండా మాత్రం ఆమె ఇలా చేయదు అనేసి అంటాడు. నీ జన్మ రహస్యం గురించి నిజం తెలుసుకోవాలని ఇదంతా చేశాను ఇక నీకు త్వరలోనే ఆ నిజం తెలిసిపోతుందని సత్య అంటుంది.. ఇక సంధ్య సంజయ్ బైక్ మీద వెళ్తుంటే సత్య చూస్తుంది. ఎవరితోనూ బైక్ మీద వెళ్తుందనేసి క్రిష్ కు చెప్పగానే కాల్ చేయమని చెప్తాడు. సంధ్యకు ఫోన్ చేస్తే నేను కంప్యూటర్ క్లాస్ లో ఉన్నానని అబద్ధం చెప్తుంది. మహానటి లాగ నటించేసావుగా నిజం తెలిసిపోతుంది అని ఇలా నటించావని సంజయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికోస్తే.. నర్స్ కోసం వెతుకుతూ క్రిష్, సత్య లు కారు దిగి నడుచుకుంటూ వెళ్తారు. అప్పటికే మేరీ అనే నర్స్ ను మహాదేవయ్య మనుషులు తీసుకొని వెళ్తారు. అది గమనించిన సత్య అక్కడ ఉన్న ఒక ఆవిడను అడుగుతుంది. ఇక్కడ మేరీ అంటే ఎవరని.. దానికి ఆమె బలవంతంగా ఎవరూ ఎత్తుకెళ్తున్నారు అనేసి చెప్తుంది.. ఇక సత్య కృష్ణ లు గురించి వెళ్లిపోవాలనిసి అనుకుంటారు. ఇక మేరీ దొరకలేదని సత్య ఫీల్ అవుతూ ఉంటుంది. మహదేవయ్యా పనే ఇదంతా అనేసి సత్య అనుకుంటుంది. ఇప్పుడు ఇక చేసేదేమి లేదని సత్య టెన్షన్ పడుతుంటే క్రిష్ సెటైర్లు వేస్తారు. ఇక సత్య క్రిష్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు.. ఇక క్రిష్ ని హనీమూన్ కి వెళ్దామని సత్య అంటుంది. క్రిష్ బాపు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యాక మనం వెళ్దామనేసి అంటాడు.
మైత్రి బర్త్ డే సందర్భంగా ఇంటికెళతాడు హర్ష. చీరకట్టుకుని అందంగా రెడీ అయి వస్తుంది మైత్రి.. ఎలా ఉన్నానని అడుగుతుంది. అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తాడు హర్ష. మేడమీదకు తీసుకెళ్లి కేక్ కట్ చేయించి తినిపిస్తాడు..మైత్రి సంతోషిస్తుంది.. ఇక లేట్ అయ్యిందని నందిని హర్షకు ఫోన్ చేస్తుంది. కాల్ కట్ చేసిన హర్షతో..నాతో డిన్నర్ చేయి రాత్రంతా ఇక్కడే ఉండు అంటుంది. నువ్వు రోజురోజుకీ నాపై డిపెండ్ అవుతున్నావ్ అది నీకు నాకు ఇద్దరికీ మంచిదికాదు. నీకు నువ్వుగా ఉండడం నేర్చుకో..నాకోసం టైమ్ వేస్ట్ చేస్తూ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటకు కోపంతో రగిలిపోయిన మైత్రి కేకును కింద పడేస్తుంది.. ఇక సత్య, క్రిష్ లు ఇంటికి వెళ్తారు. క్రిష్ తినడానికి ఇష్టపడడు. ఇక మహదేవయ్యా నాకోసమే వెయిట్ చేస్తున్నావని సత్యం అంటాడు. నేను చేసిన పాపం ఆ నర్స్ చూసింది ఆ నర్స్ ని అప్పుడే ఉద్యోగం వదిలేసి పారిపొమ్మని చెప్పాను. కానీ అప్పుడు వదిలేసినదే ఇప్పుడు ఇంత మహాపాపం అవుతుందని నేను అనుకోలేదు అందుకే ఆ నర్స్ ని ఇక భూమి మీద కనిపించకుండా చేసేసాను అనేసి అంటాడు. నేను కూడా మీకు అడ్డుపడుతున్నాను కదా నా గురించి మీరు ఆలోచించలేదు ఏంటి అనేసి అంటుంది సత్య. నా సహనం నశించినప్పుడు నీకు కూడా నర్సుకు పట్టిన గతే పడుతుంది అని అంటాడు. క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పేంతవరకు నా ప్రాణాలైనా లెక్క చేయనని సత్యం మహదేవయ్యకు చాలెంజ్ చేస్తుంది.. ఇక తర్వాత రోజు హర్షను కొందరు రౌడీలు కొడుతుంటారు. డబ్బులు వెంటనే కట్టాలి అని డిమాండ్ చేస్తారు. ఇక డబ్బులు కట్టకుంటే ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వము అని వార్నింగ్ ఇస్తారు. నందిని కూడా వాళ్ళ మీద కోపడుతుంది. ఇక నందిని వలన వదిలిపెట్టమని ఎంత అడిగినా వాళ్ళు వదిలిపెట్టరు. ఇక సంధ్య ఈ విషయం అక్కతో అక్కకి చెప్తే బాగుంటుందని సత్యకి ఫోన్ చేస్తుంది. సత్య అక్కడికి రాగానే ఫోన్ మాట్లాడుతుంది. మహదేవయ్య వింటాడు. ఏంటి మీ అన్నని పట్టుకున్నారా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారా అనేసి మహాదేవయ్యా సత్యకు చెప్తాడు. ఆ మాట వినగానే సత్య షాక్ అవుతుంది. ఈ విషయాలు నీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు నా మనసులే నేనే ఉసిగొలిపాను అనేసి మహదేవయ్య అంటాడు. ఇక ముందు ముందు నీకు చాలా ఉంటాయని చుక్కలు చూస్తావనేసి మహదేవయ్య చాలెంజ్ చేస్తాడు. దానికి సత్య టెన్షన్ పడుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..