Satyabhama Today Episode February 12th: నిన్నటి ఎపిసోడ్లో.. చక్రవర్తి వచ్చి నిజం చెప్పినా కూడా సంధ్య మాత్రం వినదు.. రూప నెంబర్ తీసుకొని ఆ రూపకు ఫోన్ చేసి మాట్లాడు అనేసి సంజయ్ దగ్గర ఫోన్ తీసుకోమని సంధ్య కు సత్య చెప్తుంది.. సంజయ్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అవసరం లేదమ్మా ఆ రూప్ అనే కాసేపట్లో వస్తుంది సంజయ్ ఫోన్ చేసుకున్న విషయాన్ని రూపనే నాకు చెప్పింది అనేసి చెప్పగానే సంజయ్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.. ఇక క్రిష్ సంజయ్ ని బయటికి తీసుకెళ్లి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారని నేను అందర్ని ఎదిరించి మీకు పెళ్లి చేశాను కానీ నాకు ఎక్కడో అనుమానంగానే ఉంది నువ్వు ఇలా చేస్తావని ఇప్పుడు చేసింది ఏంటి ఆ విషయం కనుక ఆ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత సత్య సంధ్యపై అరుస్తుంది.. నీ పెళ్ళెప్పుడు ముందు జాగ్రత్త కోసం అమ్మ నాన్నల మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నావు కదా ఇప్పుడు ఇది తెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పు అనేసి సంధ్యను అంటుంది.. ఇక రూప వచ్చి నిజం చెప్పినా కూడా సంధ్య వినదు. కానీ సంధ్య మాత్రం సత్యకు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్యా సత్యని ఎలాగైనా ఎలక్షన్స్ నుంచి తప్పి తప్పించేలా చేయాలని ప్లాన్ చేస్తాడు. నిలబడితే నీ చెల్లికి ఇక భూమి మీద నూకల చెల్లి పోయినట్లు అని వార్నింగ్ ఇస్తాడు. నీకు ఇచ్చిన గడువు ఇంకో రోజు మాత్రమే ఉంది నీ చెల్లి సంజయ్ హనీమూన్ కి వెళ్తారు ఆ తర్వాత తిరిగి రారు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక తర్వాత రోజు ఉదయం మహదేవయ్యకు సత్య కాఫీ ఇవ్వాలని వెళుతుంది. ఈరోజు నా కొడుకు కోడలు హనీమునికి వెళ్ళబోతున్నారు నువ్వు వాళ్ళ అత్తనా తోడుగా వెళ్లి వచ్చేటప్పుడు నీకు ఫోటోలు పంపించిన ఆమెను లేపేసి నా కొడుకు ఒక్కడే వచ్చేలా చూడాలని ఒక అతనికి ఫోన్ చేసి చెప్తాడు. అది విన్న సత్య షాక్ అవుతుంది. చూసావా కోడలా నేను ఈ వయసులో కూడా ఎలా షార్ప్ గా పని చేస్తున్నాను ఏదైనా కూడా మహదేవయ్య ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అవ్వదు అంటాడు.. దానికి సీరియస్ సత్య నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అనేసి మహాదేవయ్యతో అనేసి లోపలికి వెళ్తుంది.
ఇక సంజయ్ రాత్రి సంధ్యతో శోభనం గురించి పక్క ప్లాన్ వేస్తాడు. మనం ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం కానీ ఇప్పుడు మనకి శోభనం జరగకుండా మీ యొక్క అడ్డుపడుతుంది నువ్వేం చేయాలనుకుంటున్నావ్ అనేసి అంటాడు. నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను మనం పెళ్లి చేసుకోవడానికి ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. అలాగే మన ఫస్ట్ నైట్ కూడా ఎవరికి చెప్పకుండానే చేసేసుకుందాం అనేసి సంధ్య అంటుంది. ఇక రాత్రి ఎప్పుడో కాదు మనం? ఈరోజే మన ఫస్ట్ నైట్ ని మా ఫ్రెండ్ రిసార్ట్ లో చేసుకుందామని సంజయ్ అంటాడు. నీకు ఇద్దరు ఎవరికీ చెప్పకుండా రాత్రి వెళ్ళిపోతారు. ఉదయం సత్య లోపలికి రాగానే జయమ్మ సత్య ఎక్కడా కనిపించలేదు అనేసి అంటుంది.
అటు సంజయ్ కూడా కనిపించలేదా నీ భైరవి అంటుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు వీళ్లిద్దరూ అనేసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే సంధ్య సంజయ్ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఎక్కడికి వెళ్లారు ఇంత పొద్దున్నే అంటే మీకు ఎవరికీ చెప్పకుండా మేము మా ఫస్ట్ నైట్ చేసుకొని వస్తున్నామని సంధ్య అంటుంది. ఆ మాట విన్న సత్య కోపంతో చెంప పగలగొడుతుంది. సిగ్గుమాలిన పని చేస్తావా సిగ్గుమాలినా దానా అనేసి తిడుతుంది.. దానికి సంధ్య నువ్వు ఎవరు మా విషయంలో జోక్యం చేసుకోవడానికి మేము పెళ్లి చేసుకున్నాం మా ఇష్టప్రకారమే మేము శోభనం చేసుకున్నాం మేము ఏమి తప్పు చేయలేదు మేమిద్దరం భార్యాభర్తలమనేసి సత్యను అందరి ముందే తిడుతుంది..
ఇక సత్యను క్రిష్ బలవంతంగా బయటికి తీసుకుని వెళ్తాడు. నువ్వు సంధ్య మీద చేయి చేసుకోవడం తప్పు ఇంకా సంధ్య నీ మీద ద్వేషం పెంచుకుంటుంది. అది ఆలోచించవా అని అంటే నేను సంజయ్ గురించి ఆలోచిస్తున్నాను సత్య ఎలా దిగజారి పోయిందో చూశారా అందరి ముందరే నన్ను అంటుంది అక్క నాకు గౌరవం కూడా దానికి లేదు అనేసి బాధపడుతుంది. ఇక క్రిష్ నువ్వు అనవసరంగా నీపై సంధ్య మరింత ద్వేషాన్ని పెంచుకునే లాగా చేసుకుంటున్నావు ఇక వదిలేసేయ్ వాళ్ళకేమైనా అయితే నేను చూసుకుంటా కదా అనేసి భరోసా ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..