Vikrant Gupta: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దేశంలో ( Pakisthan) ఈ టోర్నమెంట్ జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్ని… దుబాయ్ లో ఆడనుంది టీమిండియా. ఇప్పటికే టీం ఇండియా కూడా ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్ కు దూసుకు వెళ్ళింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు.
Also Read: Ban vs Pak: పాకిస్తాన్ ను కాపాడిన వరుణుడు.. లేకపోతే బంగ్లా చేతిలో పరువు పోయేదే?
అతని ఎవరో కాదు విక్రాంత్ గుప్తా. స్పోర్ట్స్ జర్నలిస్టుగా ఫేమస్ అయిన విక్రాంత్ గుప్త ( Vikrant Gupta ) తాజాగా పాకిస్తాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులను ఇంటర్వ్యూ చేస్తూ.. పబ్లిక్ టాక్ కూడా తెలుసుకుంటున్నారు. వాస్తవానికి విక్రాంత్ గుప్తా…. ఇండియాకు సంబంధించిన జర్నలిస్ట్. ఆజ్ తక్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ గా.. స్పోర్ట్స్ అనలిస్ట్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే ప్రస్తుతం చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్.. పాకిస్తాన్ గడ్డ పైన జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి… విక్రాంత్ గుప్తా వెళ్లాడు.
ఈ తరుణంలోనే ఆఫ్గనిస్తాన్… మొన్న అఖండ విజయాన్ని నమోదు చేసిన తర్వాత… కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ ఫాన్స్ ( Afghanistan Fans ) పబ్లిక్ టాక్ తీసుకున్నాడు విక్రాంత్ గుప్తా. విరాట్ కోహ్లీ ఎవరు? ఆయన అంటే ఎందుకు బాగా మీకు ఇష్టం అంటూ వాళ్ళను అడిగాడు విక్రాంత్ గుప్తా. అయితే వాళ్లు… వింత సమాధానం ఇచ్చారు. బాబర్ అజాం కా బాప్ విరాట్ కోహ్లీ అంటూ ఆఫ్గనిస్తాన్ అభిమానులు కామెంట్ చేశారు. అలాగే పాకిస్తాన్ టీం ను కించపరుస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆఫ్గనిస్తాన్ అభిమానులు.
Also Read: Champions Trophy 2025: భద్రతా లోపం.. గ్రౌండ్లోకి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ జెర్సీతో ఎంట్రీ ?
దీంతో…. విశ్రాంత్ గుప్తాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు లాహోర్లో పర్యటిస్తున్న విక్రాంత్ గుప్తా కు లాహోర్లో పాకిస్తాన్ అభిమానులు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆయనతో సెల్ఫీలు కూడా చాలామంది పాకిస్తాన్ అభిమానులు దిగుతున్నారు. లేడీ ఫ్యాన్స్ అలాగే హిజ్రాలు కూడా అతనితో ఫోటోలు దిగి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా విక్రాంత్ గుప్త పేరు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది.
ఇండియాకు సంబంధించిన జర్నలిస్టు పాకిస్తాన్ దేశంలో అక్కడి పబ్లిక్ టాక్ తెలుసుకోవడంతో… ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతనికి మంచి పాపులారిటీ దక్కింది. సోషల్ మీడియాలో కూడా అతని పేరు ట్రెండ్ కావడం విశేషం. ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. అటు గ్రూపు బి లో ఇంగ్లాండ్ టీం ఎలిమినేట్ అయింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 27, 2025
MUST WATCH 🔥🔥pic.twitter.com/GbVeybX3qs
— Times Algebra (@TimesAlgebraIND) February 27, 2025