Tamim Iqbal: బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్… తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal) సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal) తాజాగా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం తమీం ఇక్బాల్ కు ( Tamim Iqbal) కొత్తేమీ కాదు. 2023 సంవత్సరం జూలై మాసంలో కూడా ఇలాగే… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించాడు. అయితే 24 గంటలు ముగియ ముందు… మరోసారి తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు.
Also Read: Ravindra Jadeja: టీమిండియాకు షాక్… మరో ఆల్ రౌండర్ రిటైర్మెంట్?
అప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జోక్యం చేసుకోవడంతో… తన రిటైర్మెంట్ గతంలో వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal). అయితే తాజాగా మరోసారి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపాడు. ఓవరాల్ గా రెండుసార్లు రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ సారి కూడా తమీమ్ ఇక్బాల్ … తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా? లేక కొనసాగిస్తాడా? అని ప్రశ్న అందరిలోనూ ఉంది.
ఇక రిటైర్మెంట్ ఇచ్చిన తరుణంలో తమీమ్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేసాడు. బంగ్లాదేశ్ జట్టు నుంచి వెళ్లడం చాలా కష్టాంగా ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌ల నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు BCBకి సమాచారం ఇచ్చా. ఆలా చెప్పడం “అనవసరం” అని తమీమ్ పేర్కొన్నారు. నేను స్వచ్ఛందంగా ఒక సంవత్సరం క్రితం తప్పుకున్నాను…కానీ మల్లి రావాల్సి వచ్చింది. ఇకపై బీసీబీ కాంట్రాక్ట్ జాబితాలో లేని క్రికెటర్ గురించి ఎవరైనా ఎందుకు చర్చిస్తారు? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజగా సిల్హెట్‌లో బంగ్లాదేశ్ సెలెక్టర్లకు తమీమ్ తన నిర్ణయాన్ని తెలియజేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టులోకి తిరిగి రావాలని గాజీ అష్రఫ్ హొస్సేన్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ కోరింది. కానీ దానికి స్టార్ క్రికెటర్… తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal) ఒప్పుకోలేదు. తన రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తమీమ్ వారికి చెప్పాడని సమాచారం. అయితే కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోతో సహా కొంతమంది బంగ్లాదేశ్ ఆటగాళ్ళు పునరాలోచించమని అభ్యర్థించడంతో, అతను ఒక రోజు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. తన అంతర్జాతీయ క్రికెట్ కు తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal) రిటైర్మెంట్ ఇచ్చాడు. బుధవారం దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఆటగాళ్ళు పునరాలోచించమని అభ్యర్థించడంతో, ఒక రోజు ఎక్కువ సమయం తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal). కానీ చివరకు రెటైమెంట్ కు మొగ్గు చూపాడు తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal).
Also Read: Virat Kohli: ఆధ్యాత్మిక ప్రాంతానికి కోహ్లీ ఫ్యామిలీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసమేనా..?
🚨 BREAKING 🚨
Tamim Iqbal has announced his retirement from international cricket 🏏🇧🇩#Cricket #Bangladesh #TamimIqbal pic.twitter.com/x8IoWeTCIs
— Sportskeeda (@Sportskeeda) January 10, 2025