Satyabhama Today Episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో… సత్య ఇంటికి వచ్చేలోగా సంజయ్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. భైరవి రుద్ర మాత్రం మళ్లీ అలాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా అని అరుస్తారు. ఇక సత్యం మాత్రం సంధ్యతో నీ పెళ్లి ఎప్పటికీ జరగదని సంజయ్ కి వార్నింగ్ ఇస్తుంది. ఇక సంజయ్ మా ప్రేమకు మీ ఆవిడ అడ్డుపడుతుంది నువ్వైనా చెప్పు బ్రో, సంధ్య లేకుండా నేను బతకలేను అని సంజయ్ డ్రామాలు ఆడతాడు. ఇక క్రిష్ సత్తి నొప్పించి బాధ్యత నాది అని సత్య దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు ప్రేమికులను ఎందుకు విడగొట్టాలని చూస్తున్నావ్ సత్య ఆ బాధ ఏంటో నీకు తెలియదా వాళ్ళు ఎంత బాధ పడతారు నువ్వు అర్థం చేసుకోలేవు అని క్రిష్ అడుగుతాడు. కొన్ని విషయాలు నేను చెప్పుకోలేని క్రిష్ ఆ ధైర్యం నాకు లేదు దేవుడు నాకు అలాంటి శాపాన్ని ఇచ్చినట్టు ఉన్నాడని సంధ్య అంటుంది. నేను ఎందుకు వద్దన్నానో నీకు తర్వాత తెలుస్తుంది అని సత్య అంటుంది. ఇక కృష్ణ బైరవి నానా మాటలు తిడుతుంది మాటలు. సత్య మాత్రం తన చెల్లెలికి పెళ్లి సంబంధం కుదిరిందని అతనితో రేపు పెళ్లి కచ్చితంగా జరిపిస్తానని క్రిష్ కి వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంధ్య కు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ పెళ్లి చూపులకు సత్య బయలుదేరుతుంది కృష్ణ అడిగితే క్రిష్ నేను రాను అని చెప్పేస్తాడు. ఇక సత్య ఒకటే పెళ్లిచూపులుకి వెళ్తుంది. పెళ్లిచూపులు కి అబ్బాయి వాళ్ళు వస్తున్నారని ఇంట్లో హడావిడి చేస్తారు విశ్వనాథ కుటుంబం. ఇక సంధ్య మాత్రం నాకు పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదని మొండిగా వాదిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఆ విషయానికి ఒప్పుకోరు నువ్వు ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే ఈ పెళ్లి సంబంధం కుదరాలని మేము కోరుకుంటున్నామని గట్టిగా చెప్పేస్తారు. సత్య కూడా సంధ్యను ఒప్పించి పెళ్లికి ఒప్పించాలని అనుకుంటుంది. ఈ సంధ్య మాత్రం సత్య నీ స్వార్థం నువ్వే చూసుకున్నావని మాటలు అంటుంది. నువ్వు బావగారిని వదిలేయ్ నేను సంజయ్ ని వదిలేస్తానని సంధ్య మొండికేసి కూర్చుంటుంది. సత్య మాత్రం ఈ పెళ్లిచూపులు అవని తర్వాత మాట్లాడుకుందాం అని రెడీ అవ్వమని చెప్తుంది..
కానీ సంధ్య మాత్రం రెడీ అవ్వకుండా ఎలాగైనా ఈ పెళ్లిచూపులు నుంచి బయటపడాలని ప్లాన్ వేస్తుంది. సంజయ్ కి ఫోన్ చేస్తుంది సంధ్య. మీ బిగ్ దాడి అంటూ మా అక్క తప్పుకోవాలని ఇలాంటివి కాకమ్మకబుర్లు చెప్పకుండా నేనంటే ఇష్టం ఉంటే చెప్పు ఇద్దరం కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుందాం లేదంటే మా అక్క ఈ పెళ్లి చూపులు ఓకే అనగానే పెళ్లి చేసేందుకు రెడీగా ఉందని సంధ్య అంటుంది.. కానీ సంజయ్ మాత్రం సంధ్య నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటాడు.. సంధ్య మాత్రం నువ్వు ఎటువంటి ప్లాన్లు వేసినా నాకు సంబంధం లేదు మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదంటే చెప్పు నేను సూసైడ్ లెటర్ రాసేసి నీ పేరు మీ బిగ్ బ్యాడ్ పేరు మా అక్క పేరు రాసి చనిపోతాను ఆ తర్వాత నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు నేను చూస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది.. ఎక్కడ కలుసుకోవాలో చెప్పు అని తొందర పెడుతుంది. సంజయ్ తప్పని పరిస్థితిలో శివాలయం దగ్గరకి రమ్మని చెప్తాడు.
అక్కకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకోవాలంటే బావగారి సపోర్ట్ కూడా ఉండాలని క్రిష్ కి సంధ్య ఫోన్ చేస్తుంది.. నాకు సంజయ్ లేకుండా నేను బ్రతకలేను మీ ఆవిడ నాకు ఇప్పుడే పెళ్లి చేసేలా అంది నేను సంజయ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను 10 నిమిషాల్లో శివాలయం దగ్గర ఉంటాను మీరు వచ్చి పెళ్లి చేస్తారా లేకపోతే నా చావు నన్ను చావమంటారా అని బెదిరిస్తుంది. ఇక క్రిష్ ఏం చేయాలని ఆలోచిస్తాడు. అటు విశ్వనాథ కుటుంబం పెళ్లిచూపులు కోసం వచ్చిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక అమ్మాయిని తీసుకురమ్మని చెప్తే నేను వెళ్లి తీసుకొస్తానని చెప్తుంది సత్య.. సత్య ఎంతసేపటికి సంధ్యని తీసుకురాకపోవడంతో విషాలక్షీ లోపలికి వస్తుంది. ఏమైందని అడిగితే లెటర్ చూపిస్తుంది ఇక విశాలాక్షి పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత విశ్వనాథం కూడా లోపలికి వస్తాడు. సంధ్య వెళ్లిపోయిన సంగతి తెలుసుకొని టెన్షన్ పడి బాధపడతాడు. ఇక హర్ష నందిని లోపలికి వచ్చి తలుపు వేసి నేను సంధ్య ఎక్కడుందో వెతికి తీసుకొస్తానని చెప్పి అంటాడు. అంటే ఇష్టం లేదని వెళ్లిపోయిన దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తావ్ రా పెళ్లి వాళ్ళకు అసలు ఇప్పుడు ఏం చెప్పాలి అని బాధపడతాడు విశ్వనాథం. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో విశ్వనాథ కుటుంబానికి ఘోర అవమానం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..