BigTV English

Brahmamudi Serial Today November 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దిగజారిపోయిన కావ్య బతుకు – దుగ్గిరాల ఇంట్లో పనిమనిషిలా మారిన కావ్య  

Brahmamudi Serial Today November 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దిగజారిపోయిన కావ్య బతుకు – దుగ్గిరాల ఇంట్లో పనిమనిషిలా మారిన కావ్య  

Brahmamudi serial today Episode:  కిచెన్‌లోకి వెళ్లి వంట చేస్తున్న ఇందిరాదేవి చేయి కాల్చుకుంటుంది. అదంతా గమనిస్తున్న రాజ్‌ వెంటనే వెళ్లి నాన్నమ్మ ఏంటిది బయట నుంచి ఫుడ్‌ తెప్పిస్తానని చెప్పాను కదా..? అంటాడు. తెప్పిస్తావు కానీ మీ తాతయ్య కొద్ది రోజులుగా బయటి ఫుడ్‌ తినడం లేదు కదా..? అందుకే వంట చేయడానికి వెళ్లాను అని చెప్తుంది ఇందిరాదేవి. ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి, ధాన్యలక్ష్మీలను రాజ్‌ కోపంగా తిడతాడు. ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఎవరైనా సాయం చేయోచ్చుగా కడుపుతో ఉన్న స్వప్న హెల్ప్‌ చేస్తుంది. మీతో కొంచెమైనా మానవత్వం ఉందా? అని అడుగుతాడు. నన్ను అడుగుతావేంటిరా.. నేను ఎప్పుడైనా కిచెన్‌ వైపు చూశానా.. అంటుంది రుద్రాణి.


ధాన్యలక్ష్మీ మాత్రం నీకు ఇప్పుడు మానవత్వం గుర్తుకు వచ్చిందా..? రాజ్‌. ఒకప్పుడు అందరి కోసం నేను ఈ పనులు చేశాను. అప్పుడు ఎవ్వరూ నా కష్టాన్ని గుర్తించలేదు. ఈ క్షణం వరకు నా కొడుకు కోసం ఏడుస్తున్నాను. ఆ ఏడుపును ఎవ్వరూ గుర్తించలేదు. ఇంత మందిలో ఉంటూ ఒంటిరిగానే బతుకుతున్నాను. నా ఒంటరి తనాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. మరి ఈ రోజు మాత్రం సడెన్‌ గా ఎలా కనిపిస్తున్నాయి ఇవన్నీ అంటూ అడుగుతుంది ధాన్యలక్ష్మీ. దీంతో పిన్ని నేను అందరిని ఒక్కలాగే చూస్తాను అంటాడు రాజ్‌. కానీ నీ తమ్ముడు మాత్రం నిన్ను రాముడి కంటే ఎక్కువగా చూశాడు. లక్ష్మణుడిలా నీ వెంటే తిరిగాడు.

కానీ వాడి గురించి ఆలోచించావా..? అవన్నీ వదిలేసి ఇవాళ సడెన్‌ గా వచ్చి మానవత్వం లేదా..? అని అడిగేస్తున్నావు. మరి నీకు మనసు లేదా..? నీకు మనషుల్లా కనిపించడం లేదా..? ఎందుకో నేను చెప్పనా.. ఇన్నాళ్లు మీ అమ్మ, కావ్య నిన్ను బాగా చూసుకున్నారు అందుకే మేము కనిపించలేదు. అంటూ ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. ఇప్పుడు అర్థమైందా..? ఇంట్లో ఆడదిక్కు లేకపోతే ఇల్లు ఎలా తయారవుతుందో అర్థమైందా..? ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని మీ అమ్మను కావ్యను ఇంటికి తీసుకురా అని చెప్తాడు సుభాష్‌. దీంతో ఈ ముసలిదాని కష్టం చూసి రాజ్‌ వాళ్ల అమ్మను తీసుకొస్తాడేమో అనుకుంటే మా అన్నయ్య ఇద్దరిని తీసుకురమ్మని చెప్తున్నాడు. కొంపదీసి రాజ్‌ కరిగిపోయి ఇద్దరినీ తీసుకొస్తాడా..? ఏంటి అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.


రాజ్‌, కావ్యకు ఫోన్‌ చేస్తాడు. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. అపర్ణ వచ్చి ఎవరు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడుగుతుంది. మీ అబ్బాయి.. అత్తయ్య అంటుంది. ఒకవేళ  మనసు మార్చుకుని ఫోన్‌ చేస్తున్నాడేమో లిఫ్ట్‌ చేయ్‌. అక్కడ ఉన్నది మీ అబ్బాయి అత్తయ్యా అంత సులువుగా ఆయన దిగొస్తారని నేను అనుకోవడ లేదు. అంటూనే ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. రాజ్‌ వెంటనే తిన్నావా..? అని అడుగుతాడు. కావ్య షాక్‌ అవుతుంది. మీరు నాకు ఫోన్‌ చేసి తిన్నావా అని అడుగుతున్నావా..? మీరు బాగానే ఉన్నారా..? అని అడుగుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది.

నువ్వు పుట్టింటికి వెళ్లడమే కాకుండా మా అమ్మను కూడా తీసుకెళ్లావు. ఇంట్లో నాన్నమ్మ వంట చేస్తూ చేయి కాల్చుకుంది తెలుసా..? అనగానే కావ్య షాక్‌ అవుతుంది. మా మమ్మీని వెంటనే ఇంటికి పంపించు అంటాడు. అపర్ణ ఫోన్‌ తీసుకుని ఏంట్రా నువ్వు ఏదో బాధ్యతగా భార్యను చూసుకునే భర్తలాగా అరుస్తున్నావు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంట్లో నుంచి తరిమేశావుగా మరి ఏ హక్కుతో అరుస్తున్నావు. అని అడగ్గానే హక్కుతో కాదు మమ్మీ తప్పు చేసిందని అరుస్తున్నాను అంటాడు రాజ్‌. దీంతో అపర్ణ కోపంగా రాజ్‌ను తిడుతుంది. మన పంతాలు పట్టింపులు పెద్దవాళ్ల మీద చూపించాలా అంటే అది నువ్వు అర్థం చేసుకోవాలి అంటూ అపర్ణ ఫోన్‌ కట్‌ చేస్తుంది.

కళ్యాణ్‌ను తీసుకుని అప్పు, అనామిక దగ్గరకు వెళ్తుంది. ఎవరిని ముంచాలని ఆలోచిస్తున్నావు అంటుంది అప్పు. ఏయ్‌ ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చారు అంటుంది అనామిక. ఆవేశపడకండి అనాముకురాలు అంటుంది అప్పు. నా సంగతి పక్కనపెట్టు ప్రస్తుతం మీరు అనామకులుగా బతుకుతున్నారు కదా..? అడుక్కుతినే పరిస్థితి రావాలని ఆరాటపడుతున్నట్టు ఉన్నారు అంటుంది అనామిక.  అయ్యయ్యో చాలా ఆశలు పెట్టుకున్నట్టు ఉన్నావు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నీ కళ్లు కుళ్లుకుంటాయి.

నీ చెవులు చిల్లులు పడతాయి. చూడు అంటూ రైటర్‌ ఇచ్చిన చెక్‌ చూపిస్తుంది. నీలాగా అడ్డదారిలో నక్క తెలివి తేటలతో వచ్చిన డబ్బు కాదు ఇది. మా శ్రీవారు స్వశక్తితో సంపాదించిన డబ్బు ఇది. నీ ఎదురుగా కనబడుతున్న ఆరడుగుల అక్షర రూపం పాటలకు ప్రాణం పోస్తున్నాడు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్నాడు. నువ్వు అంటున్న ఆ సక్సెస్‌ మా దగ్గరకు రావడానికి సిద్దంగా ఉంది. అంటూ కళ్యాణ్‌ గురించి చెప్తుంది. అనామికను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అనామిక షాకింగ్‌ గా చూస్తుంటుంది.

కావ్య భోజనం రెడీ చేసుకుని దుగ్గిరాల ఇంటికి తీసుకెళ్తానని చెప్తుంది. అపర్ణ వచ్చి నీకు బుద్దిందా అసలు నీ అవసరం తెలియాలి అనే కదా నేను ఇదంతా చేస్తున్నాను. అప్పుడు నిన్ను తీసుకెళ్లాలని వాడికి ఎలా తెలుస్తుంది అంటుంది. అంత పెద్ద కుటుంబాన్ని వదిలి నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పగానే మీ అంత పెద్ద మనుసు మీ అబ్బాయికి లేదు అంటూ చెప్తుంది కావ్య. కనకం కూడా కావ్యను తప్పు పడుతుంది. నువ్వు ఇదంతా చేస్తే ఎలా…? అంటుంది. కావ్య మా అత్తగారి గురించి నీకు తెలియదు. వాడిలో మార్పు కోసమే ఆమె అలా చేసి ఉంటుంది. అని అపర్ణ చెప్తుంది. ఇద్దరూ ఎంత చెప్పినా కావ్య కన్వీన్స్‌ కాదు. భోజనం తీసుకునే వెళ్తుంది.

కావ్య భోజనం తీసుకుని వెళ్లగానే రాజ్‌ ఎవరు మీరు అని అడుగుతాడు. ఇంటి అడ్రస్‌ అడుగుతూ.. ఫుడ్‌ డెలివరీ చేయడానికి వచ్చాను అంటూ వెటకారంగా చెప్పగానే రాజ్‌ మీ భోజనం మాకు అక్కరలేదు అంటాడు రాజ్‌. మీరు అడిగినా నేను తీసుకురానని చెప్తుంది కావ్య. ఈ వంట నేను మా అమ్మమ్మ తాతయ్యల కోసం తీసుకొచ్చాను అని చెప్తుంది కావ్య. అబ్బో నేను లేకుండా వాళ్లిద్దరూ నీకెలా తాతయ్య, అమ్మమ్మలు అయ్యారు అని రాజ్‌ అడగ్గానే వాళ్లిద్దరూ లేకుండా నువ్వెలా వచ్చావు అని కావ్య అడుగుతుంది. ఏ హక్కుతో భోజనం తీసుకొచ్చిందే అడుగు నాన్నమ్మ అంటాడు రాజ్‌. దీంతో కావ్య మా మనవరాలురా అందుకే భోజనం తీసుకొచ్చింది అని ఇందిరాదేవి చెప్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×