BigTV English
Advertisement

Satyabhama Today Episode : నందినికి కోపం తెప్పించిన మైత్రి.. క్రిష్ కు షాకిచ్చిన సత్య..

Satyabhama Today Episode : నందినికి కోపం తెప్పించిన మైత్రి.. క్రిష్ కు షాకిచ్చిన సత్య..

Satyabhama Today Episode October 24th : నిన్నటి ఎపిసోడ్ లో సత్య వంటని సంజయ్ మెచ్చుకుంటాడు. సత్య దానికి భయపడుతూ ఉంటుంది . సత్యం మీద సంజయ్ మనసు పడతాడు . ఈ అమ్మాయిని నా సొంతం చేసుకోవాలని ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. సత్య క్రిష్ తో ఈ విషయం మాట్లాడిన పెద్దగా పట్టించుకోడు. ఇక కొడుకులు గురించి మహదేవయ్యా చక్రవర్తి గొడవపడతారు. ఇంట్లోని అందరూ సత్యని పొగుడుతుండటంతో భైరవి కోపంతో రగిలిపోతుంది . ఈ విషయాన్ని పంకజంతో చెప్తే పంకజం కూడా సత్యమని ఏదో చేయాలంటూ ప్లాన్ చేస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సత్య తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే లేచి వచ్చిన సంజయ్ సత్యని చూసి స్టన్ అయిపోతాడు. ఇంత అందాన్ని నా కళ్ళతో చూస్తే సరిపోదు. నాకు కెమెరాలతో బంధించాలి అనేసి తన ఫోన్ లో ఫోటో తీయాలని ముందుకు వెళ్తాడు. సత్య కళ్ళు మూసుకొని దేవుడికి పూజ చేస్తుంటే ఫోటోలు తీస్తాడు అది గమనించిన సత్య సంజయ్ ని పిలుస్తుంది పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం ఏంటని కనీసం కొంచెం కూడా నీకు కామన్ సెన్స్ లేదా అనేసి నానా మాటలు అనిపిస్తుంది. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు . నా పర్మిషన్ లేకుండా అసభ్యంగా నా ఫోటోలు తీస్తున్నాడు అని క్రిష్ తో చెబుతుంది. కానీ క్రిష్ సంజయ్ అలా చేసి ఉండడనేసి వెనకేసుకుని వస్తాడు. అప్పుడు సంజయ్ దొరికిపోతానని ఆ ఫోటోలను ప్రత్యేక చూపిస్తాడు వాటిని క్రిష్ ముందే డిలీట్ చేస్తాడు . నాకు కాబోయే భార్యకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని అడుగుదామని ఫోటోలు తీసాను అని ఏదో సాకు చెప్పేస్తాడు.

ఇక సత్యను ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు అప్పుడు సంజయ్ ఈ ఫోటోలు డిలీట్ చేయాలంటే నా ఒక్కడికే తెలుసు అవి నాకు మాత్రమే కనిపిస్తాయి. అని ఫోటోలని ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు. ఇక నందిని హర్ష మాట్లాడుకుంటూ ఉంటారు. నందిని హర్షతో హైదరాబాద్కు నేను వస్తానని గోకుతుంది. దానికి హర్ష నంది నీకు తెలియకుండా ఆ ప్లాన్ చేశానని సర్ప్రైజ్ చేస్తాడు. దాంతో నందిని భర్తపై ప్రేమతో ఉప్పొంగి ఖుషి అయిపోతుంది. మైత్రి పని ఒక గంటలో అయిపోతుంది కదా మైత్రిని బస్సు ఎక్కించేసి ఇంటికి పంపిద్దాం మనిద్దరం చట్టా, పట్టాలేసుకొని అలా హైదరాబాద్ అంతా తిరిగేసొద్దాం అనేసి హర్షతో నందిని అంటుంది. కిటికీలోంచి వీరి మాటలను మైత్రి వింటుంది. మా ఇద్దరి మధ్యలో నువ్వెందుకు అనేసి కోపంతో ఇంట్లోనే హర్ష నందిని ఫోటోని పగలగొడుతుంది .. ఆ సౌండ్ విని అందరూ అక్కడికి వస్తారు మైత్రి గ్రామాన్ని మొదలు పెడుతుంది మైత్రి తన డ్రామాను మొదలు పెడుతుంది ఫోటో నేను కావాలని కింద వేయలేదు.


ఏదో చూస్తుంటే చేయి జారిపోయింది అంటూ ఏదో సాకులు చెప్పేస్తుంది అందరూ నమ్మేస్తారు కానీ నందిని మాత్రం నమ్మదు నందిని కోపంగా ఫోటో పగిలినందుకు బాధ లేదు కానీ నీ ఫ్రెండ్ చేయి తగిలినందుకు ఇంత బాధ పడుతున్నావా అనేసి హర్షతో గొడవకు దిగుతుంది. ఇక హర్ష నందిని కి సారీ చెప్తాడు. మళ్ళీ నందిని దగ్గరికి వెళ్లి ఏంటి ఇలా కూర్చున్నావు బట్టలు సర్దువనేసి అడుగుతాడు. ఇంట్లో అందరూ వస్తున్నారు కదా బట్టలు పెట్టాలి పెద్ద సూట్ కేస్ ఉంది అది సరిపోతుంది కదా అనేసి సరదాగా అంటుంది. హర్ష మళ్ళీ సారీ చెప్పడంతో నందిని కూల్ అవుతుంది . ఇక క్రిష్ స్నానం చేసి వస్తూనే సత్య ఫోటోలు తీస్తుంది అప్పుడు క్రిష్ టవల్ మీద ఈ ఫోటోలు ఏంటి ఇలా తీస్తున్నవ్ ఏంటి అనేసి అడుగుతాడు నా పర్మిషన్ తీసుకుని ఫోటోలు తీయాలి కదా నాకు ముందే ఫోటోలు గురించి చెప్తే మంచిగా రెడీ అయ్యి నీకు కావలసిన ఫోజులు ఇస్తాను కదా అనేసి క్రిష్ అనగానే సత్య ఆ నొప్పి ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా అంటుంది. అది తెలుసుకున్న క్రిష్.. సత్యతో దోబూచులాడుతాడు..

ఇక మహాదేవయ్య సోఫాలో నిద్రపోతూ ఉంటాడు అప్పుడే ఇంటికి వస్తాడు ఏమైంది బాబు ఇక్కడే కూర్చొని నిద్రపోతున్నావు పడుకోలేదా అనేసి అడుగుతాడు. దానికి మహదేవ నీకోసమే ఎదురు చూస్తున్నా అని అడుగుతాడు ఏదైనా చెప్పాలా చెప్పు అనేసి అడుగుతాడు. రేపు నామినేషన్స్ ఉన్నాయి వెళ్లాలి కదా ఆ నరసింహ అడ్డుపడితే ఆ నరసింహ అడ్డుని తొలగించే పని చేయాలని క్రిష్ తో మహదేవ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటీ ఎపిసోడ్ లో రేపు మనం నామినేషన్ కోసం హైదరాబాద్ వెళ్లాలని క్రిస్ తో మహదేవ అంటాడు. ఆ విషయాన్ని సత్య వింటుంది. క్రిష్ తో నేను కూడా హైదరాబాద్కు వస్తాను అనేసి అడుగుతుంది . మరి రేపటి ఎపిసోడ్లో క్రిష్ తో హైదరాబాద్ కి సత్య వెళ్తుందా లేకపోతే సత్యతో పాటు సంజయ్ కూడా వెళ్తాడు అనేది చూడాలి…

Related News

Big tv Kissik Talks: సూసైడ్  ఆలోచన చేసిన ఢీ రాజు.. ఊపిరి ఆడలేదంటూ!

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Brahmamudi Serial Today November 8th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని చంపాడని రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు    

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..

GudiGantalu Today episode: గిఫ్ట్ కొట్టేసేందుకు ప్రభావతి ప్లాన్..బాలుకు మీనా క్లాస్.. సుశీల కోసం మనోజ్ గిఫ్ట్..

Serial Actress : కెమెరా బాయ్ టు యాక్టర్.. అనిల్ జీవితంలో కష్టాలు.. ఫస్ట్ రెమ్యూనరేషన్..?

Big Stories

×