BigTV English

Kannappa Twitter Review : ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Kannappa Twitter Review : ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Kannappa Twitter Review : టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీని ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించారు. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.. ఈ మూవీలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ట్స్ కీలక పాత్రల్లో నటించారు..


ఈ సినిమాకు గత కొద్ది రోజులుగా వివాదాలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన కూడా ఏదోక అడ్డంకులు రావడంతో మూవీ వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ఇది. ఇందులో శివ భక్తుడుగా నటించారు. ఈ సినిమాను రజనీకాంత్ కూడా చూసి మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, స్టార్ ఎలాంటి అభిప్రాయాలను, రివ్యూలను వెల్లడించారు. మరి ఆలస్యం ఎందుకు ఈ మూవీ టాక్ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం..

కన్నప్ప సినిమాలో విష్ణు మంచు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతిథి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. మోహన్‌లాల్ క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్. బీజీఎం, సినిమాలోని ఎలివేషన్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. చివరి సీన్లు కంటతడి పెట్టిస్తాయి..సూపర్ హిట్ పక్కా అని ట్వీట్ చేశాడు.


 

ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మంచు విష్ణు ఫైర్ బాగుంది. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బ్లాక్ బాస్టర్ పక్కా అని కామెంట్ చేశారు..

ప్రభాస్ అతిధి పాత్రకు అన్ని చోట్లా సానుకూల స్పందనల 25 నిమిషాల విలువైన అతిధి పాత్ర రుద్ర ఆగమనం మాములుగా లేదు.. అని మరొకరు కామెంట్ చేశారు.

ఫస్ట్ హాఫ్ కాస్త డల్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్. బ్లాక్ బాస్టర్ పక్కా. బీజీఏం అదిరిపోయింది. ప్రభాస్, మోహన్ లాల్ పాత్రలు హైలెట్. అన్నీ సీన్లు బాగున్నాయి. తప్పక ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.అని మరొకరు కామెంట్ చేశారు.

 

 

Also Read: ఇవాళ థియేటర్లలోకి ‘కన్నప్ప’..ఓటీటీల్లోకి ఏకంగా 12 సినిమాలు..

‘కన్నప్ప’ చూసిన జనాలు అందరూ చెప్పేది ఒక్కటే మాట… ఈ సినిమాలో చివరి గంట చాలా బాగుందని.. అలాగే విష్ణు మంచు నటన గురించి కీలక సన్నివేశాలలో ఆయన నటన అందరిని ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. పాటలు సినిమాకు బలంగా నిలబడ్డాయట. డివోషనల్ సాంగ్స్ బావున్నాయని స్క్రీన్ మీద కూడా బాగా పిక్చరైజ్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి మంచు విష్ణు చెప్పినట్లు సినిమాకు పాజిటివ్ రివ్యులు వస్తున్నాయి.. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగాయి. మూవీ ఓవరాల్ టాక్, కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Related News

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!

Big Stories

×