E-Paper
Advertisement

OTT Movie : బ్యూటీ పార్లర్ ముసుగులో అమ్మాయిల అరాచకం… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : బ్యూటీ పార్లర్ ముసుగులో అమ్మాయిల అరాచకం… మస్ట్ వాచ్ మలయాళ మూవీ
Advertisement

OTT Movie : థియేటర్లలో విడుదలై విశేషంగా ఆదరణ పొందిన ఒక మలయాళం సినిమా, తెలుగు డబ్బింగ్ తో ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఒక బ్యాంక్ దోపిడీ చుట్టూ తిరుగుతుంది.  ఊహించని ట్విస్టులతో ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలో నటించింది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

ఈ టివి విన్ (ETV Win) లో

Advertisement

ఈ మలయాళ హీస్ట్ థ్రిల్లర్ సినిమా పేరు ‘కొల్లా’ (Kolla). 2023లో విడుదలైన ఈ సినిమాకు సూరజ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాజీషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ-సంజయ్ రాసిన కథ ఆధారంగా జాసిమ్ జలాల్, నెల్సన్ జోసెఫ్ స్క్రీన్‌ప్లే రాశారు. ఈ సినిమా 2008లో జరిగిన చెలెంబ్రా బ్యాంక్ దోపిడీ నుండి స్ఫూర్తి పొందింది. IMDb లో ఈ సినిమాకి 5.5/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025 జూన్ 19 నుండి ఈ టివి విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

అనీ (రాజీషా విజయన్), శిల్ప (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఇద్దరు యువతులు కొట్టాయం జిల్లాలోని ఎట్టుమనూర్ సమీపంలో ఒక చిన్న గ్రామంలో బ్యూటీ పార్లర్‌ను ప్రారంభిస్తారు. వీళ్ళ బ్యూటీ పార్లర్ కు బాగానే పబ్లిసిటీ వస్తుంది. కానీ వాళ్ళ ప్లాన్ వేరే ఉంటుంది. పార్లర్‌ను సాకుగా ఉపయోగించి, పక్కనే ఉన్న సహకార బ్యాంకును దోచుకోవడం. అనీ తన తండ్రి, స్నేహితుడు స్టీఫెన్, బాసిల్ అనే ఆటో డ్రైవర్ సహాయంతో ఈ దోపిడీని ప్లాన్ చేస్తారు. బాసిల్ తన ప్రేమికురాలితో పారిపోవడానికి డబ్బు కోసం ఈ ప్లాన్‌లో చేరతాడు. ఇంతలో అనీ, శిల్ప గ్రామస్థుల నమ్మకాన్ని సంపాదిస్తారు. బ్యూటీ పార్లర్‌ను రినోవేషన్ చేస్తున్నట్లు నటిస్తూ దోపిడీని విజయవంతంగా నిర్వహిస్తారు. ఇన్‌స్పెక్టర్ ఫరూక్ రహ్మాన్ నేతృత్వంలోని పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తారు.

మరో వైపు దోపిడీ సొమ్ము ఎక్కడ దాచారనే విషయం దొంగలకు కూడా తెలియని ఒక ట్విస్ట్ కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. సినిమా రెండవ భాగంలో పోలీసుల దర్యాప్తు తీవ్రమవుతుంది. అనీ, శిల్ప గతంలో ఒక షెల్టర్‌లో కలిసి ఉన్నారనే విషయం బయటపడుతుంది. అనీ, స్టీఫెన్ మధ్య సంబంధం, అలాగే ఆమె గతం కూడా కథలో ఆసక్తికరమైన మలుపులను తెస్తుంది. ఇప్పుడు వచ్చే ఊహించని ట్విస్ట్‌లు, స్టోరీని మరో లెవెల్ కి తీసుకెళ్తాయి . చివరికి ఈ దోపిడీ కేసులో వీళ్ళు జైలుకు వెళ్తారా ? పోలీసులు వెలుగులోకి తెచ్చే ఆధారాలు ఏమిటి ? ఈ బ్యాంక్ దోపిడీ నుంచి వీళ్ళంతా బయట పడతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మహేష్ బాబుకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిన రీసెంట్ సినిమా… మీరు ఇంకా చూడలేదా ?

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×