OTT Movie : మూఢనమ్మకాల థీమ్ కి సైన్టిఫిక్ రీజన్ ను జోడించి ఒక థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనే వచ్చింది. ఒక మెడికోల గ్రూప్ మాయాంగ్ అనే గ్రామంలోకి వెళ్లి, ఒక మూఢనమ్మకం వెనుక ఉన్న సైన్స్ రీజన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ థ్రిల్లర్ జర్నీలో బ్లాక్ మ్యాజిక్, సస్పెన్స్, సైకలాజికల్ మిస్టరీ ఫ్యాన్స్‌కి ఒక మరచిపోని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ తెలుగు హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘గ్రామం’ (Gramam). 2021లో వచ్చిన ఈ సినిమాకి చెన్న నారాయణ దర్శకతం వహించారు. ఇందులో భరత్ కాంత్, రూప శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. యెల్లో థాట్స్ క్రియేషన్స్ నిర్మాణంలో, 2021 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అయింది. 87 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.7/10 రేటింగ్ కూడా ఉంది. Airtel Xstream, Hungama ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : జాతరలో జగడం… దేవుడి వేషంలో ఫ్యూజులు అవుటయ్యే పనులు… ఈ సినిమా మరో కాంతారా సామీ
ఈ స్టోరీ ఒక మెడికల్ స్టూడెంట్స్ గ్రూప్‌తో మొదలవుతుంది. వీళ్ళంతా ఒక అనుమానాస్పదంగా చనిపోయిన ఒక వ్యక్తిని చూస్తారు. అది బ్లాక్ మ్యాజిక్‌తో కనెక్టెడ్ అని అనుమానం వస్తుంది. ఈ ఘటన వాళ్లని మాయాంగ్ అనే ఒక గ్రామంలోకి తీసుకెళ్తుంది. అక్కడ మూఢనమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ గురించి రూమర్స్ ఉంటాయి. ఈ గ్రామానికి అస్సాంలో “బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్”గా పేరు ఉంటుంది. హీరో (భరత్ కాంత్), హీరోయిన్ (రూప శ్రీదేవి) లీడ్ చేసే ఈ గ్రూప్, ఈ మరణం వెనుక ఉన్న సైంటిఫిక్ ట్రూత్‌ని కనుగొనేందుకు ఇన్వెస్టిగేషాన్ చేస్తారు. ఈ గ్రామంలోకి వెళ్లిన తర్వాత, వాళ్లకి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. డార్క్ రిచ్యువల్స్, గ్రామస్తుల సీక్రెట్స్, అనుమానాస్పద పాత్రలను ఎదుర్కొంటారు.
ఇప్పుడు స్టోరీ థ్రిల్లర్ మోడ్‌లోకి మారుతుంది. ఇక హారర్ ఎలిమెంట్స్ కంటే సస్పెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక సీన్‌లో, ఒక మహిళ నగ్నంగా బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్ చేస్తూ కనిపిస్తుంది. ఇది సినిమాకి డార్క్ టోన్ ఇస్తుంది. ఆశ్విన్, అతని ఫ్రెండ్స్ ఈ రిచ్యువల్స్ వెనుక ఉన్న నిజాన్ని ఛేదిస్తూ, గ్రామంలో జరిగే కొన్ని వింత సంఘటనలకు సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ కనుగొంటారు. అయితే కొన్ని మిస్టరీలు అంతుచిక్కకుండా ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆ మరణం వెనుక ఉన్న ట్రూత్ రివీల్ అవుతుంది. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆశ్విన్ ఈ గ్రామంలోని రహస్యాలను తెలుసుకుంటాడా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? ఆ గ్రామంలో నుంచి ఆశ్విన్ గ్రూప్ బయటపడుతుందా ? ఆ హత్య వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.