Shobhita shivanna passes away: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవర పెడుతున్నాయి. మొన్నటికి మొన్న సమంత (Samantha )తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu)గుండెపోటుతో నిద్రలోనే మరణించగా.. నిన్నటికి నిన్న బిగ్ బాస్ (Bigg Boss) మాజీ కంటెస్టెంట్ రతికా రోజ్ (Rathika rose) తండ్రి రాములు (Ramulu)కూడా మరణించారు. అయితే ఈయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ రెండు సంఘటనలను మరువకముందే ఇప్పుడు కన్నడ బ్యూటీ ఆత్మహత్య చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది ఎంతో భవిష్యత్తు ఉన్న ఈమె సడన్ గా హైదరాబాదులో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
ప్రముఖ నటి శోభిత ఆత్మహత్య..
కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభిత శివన్న (Shobhita shivanna) హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కి వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. కర్ణాటకలోని సక్లేశ్ పూర్ కి చెందిన శోభిత శివన్న ‘బ్రహ్మగంటు’ వంటి సీరియల్లో నటించి ఆకట్టుకుంది. అయితే 2023లో వివాహం చేసుకున్న ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమై హైదరాబాదులో స్థిరపడింది. కానీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శోభిత శివన్న నటించిన సినిమాలు, సీరియల్స్..
కన్నడలో ఏరేండ్లతూ, ఏటీఎం, జాక్ పాట్, అపార్ట్మెంట్ టు మర్డర్, వందనా వంటి కన్నడ సినిమాల లో నటించింది. ఇక బ్రహ్మగంటు , నినిదలే వంటి కన్నడ సీరియల్స్ లో నటించింది. పలు ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఇక బ్రహ్మగంటు సీరియల్ లో విలన్ గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభిత. ఇకపోతే మే 22 2023న అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఇకపోతే ఈ సమాచారం నిన్న రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఈమె ఆత్మహత్య వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు కానీ శోభిత డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బెంగళూరుకు తీసుకెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.