E-Paper
Advertisement

బిగ్ బాస్ పై ఆట సందీప్ భార్య ఫైర్.. అలాంటి వారితో షో నడిపిస్తారా?

బిగ్ బాస్ పై ఆట సందీప్ భార్య ఫైర్.. అలాంటి వారితో షో నడిపిస్తారా?
Advertisement

Jyoti Sandeep:బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి ఈ షోపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంతమంది తీవ్రస్థాయిలో మండిపడుతూ తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ప్రత్యేకించి, తాజాగా అగ్నిపరీక్ష అంటూ ఏర్పాటు చేసిన షోలో సామాన్యులను అతి దారుణంగా అవమానించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ బాలుని ఉద్దేశించి అతని జెండర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియాలో మొదలైన బిగ్ బాస్ రచ్చ..

తెలుగు బిగ్ బాస్ 10 ప్రారంభం కాకుండానే సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ మొదలయ్యింది. సామాన్యులకు అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆగస్టు 15 నుంచి ప్రారంభించారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూ మొదలైన ఈ షోలో సామాన్యులను అతి దారుణంగా అవమానిస్తూ ఎలిమినేట్ చేస్తుండడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఉప్పల్ బాలు నువ్వు ట్రాన్స్ జెండర్ వా? అని బిందు మాధవి అడగడంతో.. నీలాంటోడిని బిగ్ బాస్ హౌస్ కి పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలంటూ నవదీప్ హేళన చేయడాన్ని ఇప్పుడు తప్పుపడుతున్నారు.

ఉప్పల్ బాలును అవమానించడంపై జ్యోతి రియాక్షన్..

Advertisement

ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఉప్పల్ బాలు నవదీప్ కి శాపనార్ధాలు పెడుతూ.. తనకు న్యాయం చేయాలని షోకి పిలిపించి.. ఇంతలా అవమానించాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనవి వల్గర్ వీడియోలని, వెకిలి కంటెంట్ అనుకుంటే అక్కడ వరకు ఎందుకు పిలవాలి? ఎందుకు అవమానించాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ బాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయనకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ భార్య ప్రముఖ డాన్సర్ జ్యోతి సందీప్ (Jyothi Sandeep) మద్దతు ప్రకటిస్తూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జిలను ఏకీపారేశారు.

సామాన్యులను పిలిపించి మరీ అవమానిస్తారా?

ఈ సందర్భంగా ఒక వీడియో విడుదల చేస్తూ..” నాకు పర్సనల్గా బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. ఆ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది అనేది కూడా నిజం. కానీ బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్లే వస్తున్నారా? లేదు కదా.. అసలు బిగ్ బాస్ షో కి రావడానికి అర్హత లేని వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యంగా గత సీజన్ లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లపై నెగెటివిటీ ఉంది. పైగా ఎక్స్పోజింగ్ కూడా చేశారు. ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్న వాళ్ళని కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు. సొసైటీ వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటుంది? టిఆర్పి రేటింగ్ కోసమే తీసుకుని వచ్చారు కదా.. వాళ్లతో పోల్చుకుంటే ఉప్పల్ బాలు చాలా బెటర్ కదా.. ఏది చేసినా కూడా నలుగురిని నవ్వించేలా చేస్తాడు. ఇలాంటి వ్యక్తిని షోకి పిలిపించి అతన్ని ఏడిపించడం చాలా బాధగా అనిపించింది.

Advertisement

also read:చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!

నెగిటివిటీ పెరుగుతోందా?

ముఖ్యంగా కొంతమందితో పోల్చుకుంటే ఉప్పల్ బాలు చాలా బెటర్ అందరినీ నవ్వించడానికి అలా చేస్తాడు. ఆడపిల్లలు ఎక్స్పోజింగ్ చేసి ఫేమస్ అవుతున్నారు. అలాగే తనకు అనిపించిన దాంట్లో తాను చేశాడు.. ముఖ్యంగా ఈరోజుల్లో సెలబ్రిటీలుగా పిలవబడుతూ బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా టాలెంట్ తో రాలేదు. వైరల్ కంటెంట్ తోనే నైట్ కి నైట్ ఫేమస్ అయ్యి, కేసులు అయి, వాళ్ళకున్న బీభత్సమైన నెగెటివిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అలాంటి వాళ్ళు కనిపిస్తే బండబూతులతో కామెంట్ బాక్స్ నిండిపోతుంది. అలాంటి వాళ్ళనే బిగ్ బాస్ లోకి తీసుకురాగా లేనిది.. మంచి వాళ్లను బిగ్ బాస్ లోకి తీసుకొస్తే తప్పేముంది.. ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం నాకైతే నచ్చడం లేదు.. అంటున్న తన అభిప్రాయాలను పంచుకుంది జ్యోతి రాజ్ సందీప్. మొత్తానికైతే బిగ్ బాస్ అగ్నిపరీక్షపై ఇప్పుడు రోజు రోజుకు నెగిటివిటీ పెరుగుతోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×