Siri Hanumanth.. ఈ మధ్యకాలంలో కొన్ని జంటలు సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆ జంటలలో కొంతమంది లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో సిరి హనుమంతు(Siri Hanumanth), శ్రీహాన్ (Shrihan)జంట కూడా ఒకటి. యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్, ఇన్స్టా రీల్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది ఈ జంట. ఇకపోతే వీరిద్దరూ కూడా బిగ్ బాస్ సెలబ్రిటీలే కావడం గమనార్హం. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి , సీజన్ 6 లో శ్రీహన్ ఇద్దరూ కూడా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఆన్ స్క్రీన్ పై కూడా ఎంతో చూడముచ్చటగా అందంగా కనిపించే ఈ జంట నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
లవ్ బర్డ్స్ గా గుర్తింపు..
అంతేకాదు ఈ లవ్ బర్డ్స్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ జంట ప్రేమలో ఉన్నారే కానీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. దీంతో అభిమానులు కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఎదురు చూస్తున్నారు. ఇక అదిగో ఇదిగో అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. ముఖ్యంగా పెళ్లి గురించి కూడా వీళ్ళిద్దరూ పలు సందర్భాలలో మాట్లాడారు. త్వరలోనే అంటున్నారే కానీ ఆ త్వరలో అనేది ఎప్పుడూ అని మాత్రం చెప్పలేదు. దీనికి తోడు వీరిద్దరూ ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. మరి ఆ అబ్బాయి ఎవరు..? అన్న విషయం ఇంకా తెలియలేదు.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బిగ్ బాస్ జంట..
ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈసారి పెళ్లి వెన్యూ కూడా చెబుతున్నారు. త్వరలోనే వైజాగ్ లో తమ వివాహం జరగనుంది అని, సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతోంది. అంతేకాదు త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడనున్నట్లు సదరు వార్త యొక్క సారాంశం. మొత్తానికైతే ఇప్పటివరకు ప్రేమ పక్షుల్లా ఉన్న వీరు ఇక త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
సిరి హనుమంతు కెరియర్..
సిరి హనుమంతు విషయానికి వస్తే.. టెలివిజన్ న్యూస్ రీడర్ గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత సీరియల్స్ ద్వారా తన అదృష్టాన్ని పంచుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తో పాటు కవర్ సాంగ్స్ పలు యాడ్స్ లో కూడా మెరిసిన ఈమె సిరీస్ లలో కూడా నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే హాస్య ప్రదర్శన కార్యక్రమమైన జబర్దస్త్ లో కూడా యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్ లో నటించిన సిరి హనుమంతు.. ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి పలు రీల్స్ చేస్తూ గడిపేస్తోంది. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.