Bigg Boss Buzz: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఇక నేడు ఈ కార్యక్రమం నుంచి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్ అపూర్వ(Apoorva) హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగిన అపూర్వ నేడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈమెకు ప్రేక్షకుల నుంచి చాలా తక్కువ ఓట్లు రావడంతోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు.. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సరాసరి బిగ్ బాస్ బజ్ (Bigg Boss Buzz)కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో భాగంగా అపూర్వ పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా హోస్ట్ శివాజీ (Sivaji) కంటెస్టెంట్ అపూర్వ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రోమో ప్రారంభంలోనే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు హౌస్ లో మీరు ఎవరికైనా అలాంటి రెస్పెక్ట్ ఇచ్చారా అంటూ శివాజీ అడగడంతో తాను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చాను అని అపూర్వ సమాధానం చెప్పారు కానీ మీకు అందరు వ్యతిరేకంగా ఓట్లు వేశారని శివాజీ తెలిపారు.
తాను యాక్, చీప్ అని ఎవరిని ఎక్కడ మాట్లాడలేదు అంటూ ఈమె చెప్పడంతో వెంటనే శివాజీ బూతులు మాట్లాడనంత మాత్రాన నీతిమంతులా ?అంటూ మండిపడ్డారు. వెంటనే అపూర్వ మీరు నన్ను పూర్తిగా మాట్లాడనివ్వలేదు అంటూ శివాజీకి ఎదురు మాట్లాడటంతో వెంటనే శివాజీ ఇక్కడ కూడా మీరు నన్ను డామినేట్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ అడగాల్సిన బాధ్యత నాదే నా ప్లేస్ లో మీరే కూర్చోండి అంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ లో కూడా మీరు అందరిపై అరుస్తున్నారు ఆ తర్వాత బెగ్ చేస్తున్నారు అంటూ శివాజీ మాట్లాడటంతో నేను బెగ్ చేయలేదని ఎదురు సమాధానం చెప్పారు. మా అందరికీ కనిపించింది అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చారు.
REAL QUESTIONS. UNFILTERED ANSWERS! 👁️🔥
Don’t miss Apoorva’s BIGG BOSS BUZZZ Exit Interview!👁️
Get ready for RAW emotions and REAL talk🔥Watch #BiggBossBuzzz Today at 10:30 PM on #StarMaa
#BiggBossSeason10Telugu #StarMaaPromo pic.twitter.com/0Sa5PcSRoT— Starmaa (@StarMaa) October 11, 2026
ఇక హౌస్లో ఈమె ఎఫ్ ఐ ఆర్ అనే పదాన్ని ఎఫైర్ అంటూ మాట్లాడిన విషయాన్ని కూడా శివాజీ గుర్తు చేశారు. అందుకు అపూర్వ సంజాయిషి ఇచ్చుకోవడంతో గాలికి పోయే కంపను తగిలించుకోవడం ఎందుకు అంటూ అపూర్వ పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఆపూర్వ ఏం చెప్పారు అనే విషయాలు తెలియనున్నాయి. ఇక నేడు అపూర్వతో పాటు మరొక కామనర్ చరణ్ కూడా ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇక నేడు వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Also Read: రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!