E-Paper
Advertisement

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!
Advertisement

Ramcharan RC17 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానుల్లో కొంతపాటి నిరాశ అయితే ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్(Ram Charan) తదుపరి సినిమాని ప్రముఖ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలువబడింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చాయి.

రామ్ చరణ్ కోసం అనిరుద్..

ఇలా ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్(Anirudh Ravichandran) రంగంలోకి దిగారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారని ఇప్పటికే ఈయనతో చర్చలు కూడా పూర్తి అయ్యాయని. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉంటారు. అయితే దేవిశ్రీప్రసాద్ హీరోగా సినిమాలలో బిజీగా ఉన్నారు.

హీరోగా బిజీగా మారిన దేవిశ్రీ ప్రసాద్…

Advertisement

ఈ విధంగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా బిజీగా ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా కోసం అనిరుద్ రవిచంద్రన్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరొక ముద్దుగుమ్మ పేరు కూడా వినపడుతుంది. దురంధర్, యుఫోరియా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సారా అర్జున్(Sara Arjun)  ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దురంధర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ సూపర్ సక్సెస్ అందుకున్నారు.

రామ్ చరణ్ జోడిగా సారా అర్జున్..

ఈ సినిమా రెండు భాగాలు సుమారు 3000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సారా అర్జున్ ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారనే విషయం తెలియగానే ఈ సినిమా పట్ల భారీగా అంచునాలు ఉన్నాయి. మరి నిజంగానే సారా అర్జున్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీ పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది. ఇక ఈ విషయాలకు సంబంధించి చిత్ర బృందం త్వరలోనే అధికారక ప్రకటన తెలియజేయనున్నారు.

Advertisement

Also Read: కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!

Related News

మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !

చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?

కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!

పవన్ పని తీరుపై ప్రశంసలు కురిపించిన చిరు… నెం.1 స్థానంలో ఏపీ!

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. వారి కోసమే ప్రత్యేకంగా?

సాయి పల్లవిని చంపేయాలనుకున్నా.. అది తట్టుకోలేకపోయా: అనుపమ షాకింగ్ కామెంట్స్

‘నవరాత్రి స్పెషల్’.. కళ్ళతోనే కూచిపూడి ఆడిన స్టార్ హీరోయిన్!

Big Stories

Advertisement
×