Ranabali Kobali:అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం .ఇందులో భాగంగా ఇప్పటికే ఏందయ్యా స్వామి అనే పాటని వదిలిన మేకర్స్ తాజాగా కోబలి అనే మరో సాంగ్ ని వదిలి సినిమాపై అంచనాలని పెంచేశారు.
సంగీతాన్ని అందించిన అజయ్–అతుల్
అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి వచ్చిన ఏందయ్యా స్వామి ఇప్పటికే యూట్యూబ్ లో మంచి అప్లాజ్ ని మూటకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మధ్య కెమిస్ట్రీని చాలా అద్భుతంగా తెరకి ఎక్కించాడు డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ .ఇక ఇప్పుడు కోబలితో విజయ్ దేవరకొండ లోని మరో కోణాన్ని ఆడియన్స్ కి పరిచయం చేయడం విశేషం .ఇక పాట విషయానికి వస్తే అజయ్–అతుల్ సంగీతాన్ని అందించిన ఈ పాటని కేశవాదిత్య రాయగా ప్రముఖ గాయకుడు వీ.ఎం. మహాలింగం ఈ పాటను పాడటం విశేషం
19వ శతాబ్దానికి చెందిన కథ
ఈ సినిమా విషయానికి వస్తే ఇది 19వ శతాబ్దానికి చెందిన కథగా తెలుస్తోంది .ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కరువు పరిస్థితుల నేపద్యంలో సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. 1870 కాలంలో రాయలసీమ ప్రాంతాన్ని పట్టి పీడించిన కరువు, బ్రిటీష్ వలస పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు సినిమా కథకి బ్యాక్ గ్రౌండ్ గా నిలుస్తుందని సమాచారం.
బ్రిటిష్ వలస పాలనలో తమ హక్కుల కోసం పోరాడాల్సి వచ్చిన సామాన్య ప్రజలకి అక్కడే పుట్టి పెరిగిన రణబాలే ఎలా అండగా నిలిచాడు. బ్రిటిష్ పాలకులను ఎలా ఎదుర్కొన్నాడు వంటి విషయాలని ఈ సినిమాలో చూపించబోతున్నారు
గతంలో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ ,RRR..ఇలా ఎన్నో సినిమాలు ఆడియన్స్ ని అలరించాయి. అయితే ఇదే కోవలో తంగలాన్,కంగువా ,పోన్నియన్ సెల్వన్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి .
బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో!
మొత్తానికి అక్టోబర్ 16న రిలీజ్ కి సిద్ధమవుతున్న రుణబాలి పాటతో ప్రమోషన్లని స్పీడ్ అప్ చేసినట్టే కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాకి టికెట్ ధరలు పెంచకపోవడమే.ఇక ఇప్పటికే నా సినిమాలకి అసలు టికెట్ ధరలు అనేవే పెంచను,ఒక్క రాజమౌళి తో చేస్తే తప్ప అని రౌడీ హీరో ఓపెన్ గా చెప్పేశాడు కూడా. అయితే దీని కన్నా ఒక రోజు ముందుగా రిలీజ్ అవుతున్న జైలర్ 2 కి మాత్రం ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచడం గమనార్హం.
ALSO READ :మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !
చూడాలి మరి జైలర్ 2 తో డీ అంటే డీ అంటున్న రణబాలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో!