E-Paper
Advertisement

సోనియా ఆకుల భర్త బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

సోనియా ఆకుల భర్త బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Kissik Talks:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెలెబ్రిటీ టాక్ షో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)లో ఈ వారం మరో ప్రముఖ సెలెబ్రిటీతో మన ముందుకు వచ్చేందుకు సిద్దమైంది.తెలుగులో పలు సినిమాలలో నటించి,బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆటతీరుతో ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న సోనియా ఆకుల ఈ వారం కిస్సిక్ టాక్స్ (Kissik Talks)లో పాల్గొనగా 72వ ఎపిసోడ్ గా వస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఇపుడు తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఫ్లై హై కన్సల్టెంట్స్ సీఈఓ

ఈ ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ తన భర్త పేరు వీరగోని యశ్‌పాల్‌ అని, తను ఫ్లై హై కన్సల్టెంట్స్ సీఈఓ గా ఉన్నాడని, అంతేకాకుండా తనొక సీరియల్ ఎంట్రప్రెన్యూర్ అని తెలిపింది. ఇక అతనికి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఎంతో అనుభవం మరియు అవగాహన ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తామొక హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని తీసుకొస్తున్నామని, అది మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేవిధంగా రీజనబులు బడ్జెట్ లో ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపింది.

Advertisement

also read :టాక్సిక్ ఫస్ట్ డే కలక్షన్స్ ఎంతో తెలుసా ?

ఇక సోనియా ఆకుల విషయానికి వస్తే.. 1987 మే31 న తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథనిలో ఆకుల చక్రపాణి, మల్లీశ్వరి దంపతులకు జన్మించింది.ఇక మంధనిలో తొమ్మిదో తరగతి వరకు చదివిన సోనియా పదోతరగతిని హన్మకొండలోని S.R స్కూల్ లో కంప్లీట్ చేసింది. ఇక తన ఇంజనీరింగ్ ని హైదరాబాద్ లోని భోజ్ రెడ్డి కాలేజీలో పూర్తి చేసిన సోనియా కొన్నాళ్ళు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో కూడా పని చేసింది.

చిన్నప్పటి నుండే సేవా గుణం

Advertisement

ఇక చిన్నప్పటి నుండే సేవా గుణం కలిగిన సోనియా ‘ఆసా’ (యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ ) అనే ఒక స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేయడం విశేషం.దాని ద్వారా తల్లి దండ్రులు లేని ఎంతో మంది అనాథ పిల్లలకి తన వంతు సాయం చేసింది సోనియా. ముఖ్యంగా కరోనా సమయంలో వచ్చిన లాక్ డౌన్ లో ‘ఆసా’ ద్వారా ఎంతో మందికి రోజూ వారి సరుకులని పంపి తన గొప్ప మనసుని చాటుకుంది.

ఇక దిశ కేసులో అత్యాచార నిందితుడిగా ముద్ర పది ప్రాణాలు కోల్పోయిన రేణుకకి నెలకి పదిహేను వేల సాయం అందించడం, అలాగే ‘ప్రాజెక్ట్‌ ప్రేరణ’ అనే పేరుతో టీనేజర్స్ కి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాల్ని నిర్వహించింది సోనియా.అలాగే దాదాపు యాబయి మందికి పైగా అమ్మాయిలకి దాతలతో చదువు చెప్పించడం విశేషం.

ఫుల్ ఎపిసోడ్ ని చూడాల్సిందే

ఇక సోనియా ఆకుల పెళ్లి విషయానికి వస్తే ..2024 నవంబర్ 20న ఫ్లై హై కన్సల్టెంట్స్ సీఈఓ వీరగోని యశ్‌పాల్‌ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సోనియా ఆకుల డిసెంబర్ 21న పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే.

also read :టాక్సిక్ దెబ్బకి దిల్ రాజు విలవిల?

మొత్తంగా ప్రోమోలోనే పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్న సోనియా ఇంకెలాంటి సంచలన విషయాలని బయటపెట్టిందో తెలియాలంటే ఆదివారం టెలీకాస్ట్ అయ్యే కిస్సిక్ టాక్స్ ఫుల్ ఎపిసోడ్ ని చూడాల్సిందే !

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×