Kissik Talks: యూట్యూబర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. అద్భుతమైన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బుల్లితెర నటి సోనియా సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రౌడీ బేబీ , హే పిల్ల వంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. 2023 లో సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా తన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే నితిన్, శ్రీ లీలా జంటగా నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో కూడా ఒక కామెడీ పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది.
అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధూ తో కలిసి శశి మథనం అనే ఒక ఓటీటీ సినిమాతో కూడా ఆడియన్స్ ను పలకరించిన సోనియా.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగబంధం సినిమాలో కూడా కీలకపాత్ర పోషించి అదరగొట్టేసింది. ఇందులో ఆమెది చిన్న పాత్ర అయినా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని తన పెళ్లిపై ఊహించని అప్డేట్ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.
also read:చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 పై తమన్ అదిరిపోయే అప్డేట్!
జబర్దస్త్ వర్షా హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ 68వ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చింది సోనియా. అందులో భాగంగానే వర్షా మాట్లాడుతూ.. సిద్ధూ – సోనియా పెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నించగా ఏమో పెళ్లయిపోయిందేమో.. బహుశా నేను చెప్పట్లేదేమో అంటూ సడన్ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీన ఎర్లీ మార్నింగ్ 1:45 గంటలకు మా పెళ్లి అంటూ డేట్ తో పాటు ముహూర్తాన్ని కూడా చెప్పేసి అందరిని సర్ప్రైజ్ చేసింది. మొత్తానికైతే ఇన్ని రోజులు ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ జంట ఎట్టకేలకు సెప్టెంబర్ 2వ తేదీన పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది సోనియా. ఇక ప్రస్తుతం సోనియా చేసిన కామెంట్లు, పెళ్లిపై ఇచ్చిన అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేశాయి. ఇకపోతే సెప్టెంబర్ 2 అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్తడే రోజు మీరు వివాహం చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా సోనియా ఫోటోలు, వీడియోలు చూడాలి అంటే సబ్స్క్రిప్షన్ ఎంత తీసుకోవాలి అని అడగగా ఫ్రీ ఫ్రీ అంటూ చెప్పేసింది సోనియా. ఇక అలాగే పిల్లల గురించి మాట్లాడుతూ.. తెలిసిన వారు చెప్పారు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుడతారని. ఇక నేను అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నాను.. అది నిజమవుతుందా లేదా అంటూ పిల్లలపై కామెంట్ చేశాను చేసింది.
ఇక అలాగే ప్రాపర్టీ గురించి కూడా వర్ష అడిగింది.. సిద్దు మీకు కలిపి మొత్తం ఎంత ఆస్తి ఉంది అని అడగ్గా.. వైటా, బ్లాకా అంటూ ఝలక్ వచ్చింది సోనియా.. లాస్ట్ ఇయర్ ఒక ఇల్లు కొన్నాము.. అలాగే ఒక బెంజ్ కార్ కూడా కొనుగోలు చేశాం.. అయితే ఇవి కొన్న సమయంలో కూడా మాపై ఎన్నో రూమర్స్ గుప్పించారు. కానీ అవన్నీ మేము ఈఎంఐ లోనే కొన్నాము అంటూ సోనియా క్లారిటీ ఇచ్చింది.