E-Paper

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌
Advertisement

Pakistan, Saudi Arabia sign agreement:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మధ్యకాలంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టును మెరుగుపరిచే విధంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్లను హిట్టర్లుగా మార్చేందుకు అమెరికాలో ట్రైనింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అటు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాతో భారీ ఒప్పందాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే తాజాగా సౌదీ అరేబియా వెళ్ళిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ, సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్ ప్రిన్స్ సౌది బిన్ లు రియాద్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు.

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, సౌదీ అరేబియా మధ్య ఒప్పందం

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే సౌదీ అరేబియా మధ్య ఒప్పందం ప్రకారం, జెడ్డా నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలు మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకుంది. ఈ స్టేడియం నిర్మాణానికి సలహాలు, పిచ్ ల తయారీ మెలుకువలు, ఐసీసీ ప్రమాణాల నిర్వహణ తదితర విషయాలను సౌదీకి అందిస్తుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంటే ఓవరాల్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోనే ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కానుంది. డబ్బులు మాత్రం సౌదీ అరేబియా అందించనుంది. విజన్ 2030 ప్లాన్ లో భాగంగా క్రీడారంగంలో పెట్టుబడులు పెడుతుంది సౌదీ అరేబియా. ఇక భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. పాకిస్తాన్ లో పర్యటించినందుకు విదేశీ క్రికెటర్లు భయపడుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. సౌదీతో డీలింగ్ కుదుర్చుకుంది. దీంతో బీసీసీఐని దెబ్బ కొట్టడమే కాకుండా…. తమకు స్టేడియం కూడా దక్కుతుందని పాకిస్తాన్ ఆలోచన.

సౌదీ-పాకిస్తాన్ ఒప్పందంతో బీసీసీఐ ఆదాయానికి గండి ?

పాకిస్తాన్ అలాగే సౌదీ అరేబియా మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయానికి గండి పడుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ఒప్పందం కారణంగా బీసీసీఐకి ఎలాంటి నష్టం జరగబోదని అంటున్నారు. ఐసీసీకి 80% ఆదాయం బీసీసీఐ నుంచే వెళ్తోంది. టీమిండియా ఆడితేనే, వ్యూయర్షిప్ అత్యధికంగా వస్తుంది. డబ్బులు ఎన్ని ఉన్నా ఆదరణ కూడా ఉండాలి. మన ఇండియాలో డబ్బుతోపాటు ఆదరణ కూడా అద్భుతంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా… బీసీసీఐకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండబోదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ అరేబియా కాదు… వాళ్ళ అయ్య దిగివచ్చినా బీసీసీఐని ఏం పీకలేరని అంటున్నారు.

Advertisement

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

 

 

Related News

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తో వెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Nida Dar: నన్ను చూస్తేనే టీమిండియా భ‌య‌ప‌డిపోయేది..రాత్రుళ్లు ఉలిక్కిప‌డేవారు

టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది

Big Stories

×