Suma Kanakala.. బుల్లితెరపై మకుటం లేని మహారాణి లా యాంకరింగ్ లో దూసుకుపోతూ ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న సుమా (Suma) మలయాళం అమ్మాయి అయినప్పటికీ, అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ.. ఎంతోమంది తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఈవెంట్ ఏదైనా సరే సుమా ఉండాల్సిందే అనేంతగా ఈమె పాపులారిటీ సొంతం చేసుకుంది.ముఖ్యంగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని తెలుగింటి కోడలైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ, బుల్లితెరపై ఎన్నో టీవీ షోలను చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. సుమా తోపాటు కెరియర్ ప్రారంభించిన చాలామంది ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోగా.. సుమా మాత్రం ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూ యాంకరింగ్ లో తనకు పోటీ ఇచ్చే వారే లేరు అన్నట్టుగా పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా గజినీలా మారిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది సుమా.. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
గజినీలా మారిన సుమా..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. తన ఈవెంట్లు, షోలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉండే ఈమె, ఈ వయసులో కూడా ట్రెండీ వేర్ లో ఫోటోలు నిర్వహించి వాటిని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫన్నీ వీడియో షేర్ చేసింది సుమా. ఒక కబోర్డు ను ఓపెన్ చేసిన సుమా.. అసలు నేనెందుకు ఓపెన్ చేశాను అంటూ ఆలోచిస్తుంది. ఆ వెంటనే మొబైల్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి.. నీకు విషయం చెప్పాలి గీత అంటుంది. ఆ తర్వాత తాను ఏం చెప్పాలనుకుంటుందో గుర్తు రాక మళ్ళీ చెబుతాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తుంది ..ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి, అవును, నేను ఎందుకు ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను అంటూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటే .. ఆ కుర్రాడు నేనే మిమ్మల్ని పిలిచాను అని బదిలిస్తాడు. ఎందుకు పిలిచావని సుమా అడిగితే.. మరిచిపోయానంటూ వెళ్ళిపోతాడు.ఈ మతిమరుపుతో అందరూ ఇబ్బంది పడుతున్నారు అంటూ చెబుతూ ఒక వీడియో షేర్ చేసింది. అంతేకాదు వీడియోని షేర్ చేయడమే కాదు మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేశారా అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికి అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఫన్నీగా సుమా గజినీ అయిపోయిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సుమా కెరియర్..
ఇక సుమా విషయానికి వస్తే.. పదహారేళ్ళ వయసులోనే యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె, 1995లో సాటిలైట్ ఛానల్స్ హవా భారత దేశంలో మొదలవుతున్న దశలో పలు సీరియల్స్ లో నటించింది. అన్వేషిత , రావోయి చందమామ, స్వయంవరం, గీతాంజలి అనే సీరియల్స్ లో నటించింది . ఆ తరువాత కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో కూడా నటించింది. అంతే కాదు పవిత్ర ప్రేమలో నందమూరి బాలకృష్ణ చెల్లిగా కూడా నటించింది. ఇక ఇవన్నీ సెట్ కావని భావించిన ఈమె.. బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఇక్కడ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
View this post on Instagram