EPAPER

Samantha: ఎవరైనా ఫార్మల్ డ్రెస్ లో ఆ డ్యాన్స్ చేస్తారా? ‘గేమ్ ఛేంజర్’ పాటపై సామ్ రియాక్షన్

Samantha: ఎవరైనా ఫార్మల్ డ్రెస్ లో ఆ డ్యాన్స్ చేస్తారా? ‘గేమ్ ఛేంజర్’ పాటపై సామ్ రియాక్షన్

Samantha : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘రా మచ్చా మచ్చా’ అనే సెకండ్ సింగిల్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఓవైపు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సాంగ్ ను వైరల్ చేస్తుంటే, మరోవైపు సెలబ్రిటీలు సైతం చెర్రీ డాన్స్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సమంత కూడా ఈ పాటపై స్పందిస్తూ వెరైటీగా రిప్లై ఇచ్చింది. మరి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ లో చెర్రీ పాటపై సమంత రియాక్షన్ ఏంటంటే…


ఫార్మల్ డ్రెస్ లో ఇలా డాన్స్ చేస్తారా?

‘రా మచ్చా మచ్చా’ అనే ‘గేమ్ ఛేంజర్’లోని సెకండ్ సింగిల్ మెగా అభిమానులను ఊపేస్తోంది. కానీ సాధారణ మూవీ లవర్స్ నుంచి మాత్రం ఈ పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పాటపై ఆయన సతీమణి ఉపాసన కామెంట్ చేసింది. ‘మిస్టర్ చెర్రీ ఈ పాటతో మీరు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత సమంత ‘అన్ మ్యాచబుల్’ అంటూ రిప్లై ఇచ్చింది. కానీ అంతలోనే ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుందో ఏమోగానీ ‘ఫార్మల్ షర్ట్, ప్యాంట్ లో చెర్రీలా మరెవ్వరూ డాన్స్ చేయలేరు’ అనే విధంగా వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం చెర్రీ డాన్స్ పై ఉపాసన సమంత చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ పాటను 1000 మంది డాన్సర్లతో, ఇండియాలోని పలు రాష్ట్రాల సంస్కృతులు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు శంకర్. తాజాగా ఈ పాటకు సంబంధించి రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో చెర్రీ కూడా ఫూట్ ట్యాపింగ్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఇక సినిమాలో ఈ పాట చెర్రీ ఎంట్రీకి సంబంధించిందని ఇప్పటికే శంకర్ హింట్ ఇచ్చారు. మరి ఈ సాంగ్ థియేటర్లలో శంకర్ మార్క్ సాంగ్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించేలా చేస్తుందా అనేది చూడాలి.


డిసెంబర్లో తెరపైకి  ‘గేమ్ ఛేంజర్’

విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి ఇద్దరూ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. కార్తీక్ సుబ్బరాజు కథను అందించగా, ఎస్జె సూర్య, జయరాం, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ పొలిటికల్ థ్రిల్లర్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.. కానీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

Related News

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్

Vettaiyan Movie Review : వెట్టయాన్ మూవీ రివ్యూ… రజినీకాంత్‌కి ఇది సరిపోయిందా…?

Nayanatara: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?

Viswam: సెన్సార్ పూర్తి చేసుకున్న గోపీచంద్ మూవీ.. ఆ సన్నివేశాలు డిలీట్..!

Manchu Vishnu : మంచు విష్ణుకు అనుకూలంగా కోర్టు తీర్పు… ఇక ట్రోలర్స్ కు చుక్కలే

Karan Johar: కరణ్ ధరించే టై విలువ తెలిస్తే షాక్..!

×