Telugu TV Serials : బుల్లితెర ఆడియన్స్ ను సీరియల్స్ ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగానే ఆకట్టుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో టీవీ సీరియల్స్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి టీవీ ఛానల్ కూడా కొత్త కొత్త ప్రోగ్రాంలతో పాటుగా సరికొత్త స్టోరీలతో సీరియల్స్ ని అందిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి .. సినిమాలకు ఎలాగైతే వీక్లీ బాక్స్ ఆఫీస్ రికార్డు ఉంటుందో సీరియల్స్ కి కూడా అలాగే టిఆర్పి రేటింగ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ వారం టీవీ సీరియల్స్లలో ఏ ఛానల్ లోని సీరియల్స్ కి మంచి రేటింగ్ నమోదు అయిందో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
కొత్త సీరియల్స్ కి కొదవలేదు అన్న విషయం అందరికీ తెలుసు. ప్రతి సీరియల్లో పాత సీరియల్ ఉండగానే కొత్త కొత్త సీరియల్స్ ని పేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ రోజుకొకటి పుట్టుకొస్తుంది. అయితే కొత్త సీరియల్స్ ఎన్ని వచ్చినా కూడా పాత సీరియల్స్ కి ఉన్న డిమాండ్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్ స్టోరీలకు మంచి ట్రెండ్ ఉంటుందన్న విషయం చెప్పనక్కర్లేదు. ఈవారం టిఆర్పి రేటింగ్ విషయంలో కొన్ని సీరియల్స్ టాప్ లో కొనసాగితే మరి కొన్ని సీరియల్స్ మాత్రం చాలా తక్కువ రేటుని నమోదు చేసుకోవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే పరిస్థితి ఏర్పడింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రెండు సీరియల్స్ మరేవో కాదు ఒకటి ఇంటింటి రామాయణం సీరియల్ రెండోది నిన్ను కోరి. ఈ రెండు సీరియల్స్ ఈమధ్య చాలా డల్ గా ఉండడంతో వీటిని తీసేయాలి అని జనాలు కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే.. పోయిన వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.63 గా ఉంది.. రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.30ఉంది. పొదరిల్లు 11. 55, ఇంటింటి రామాయణం 11.34, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.35, నువ్వులేక నేను లేను 10.30, నిండు మనసులు 9.20, చిన్ని 68.33, బ్రహ్మముడి 8.17.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత నమోదు చేసుకుంటుందో చూడాలి..