E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
Advertisement

Rains In Telugu States: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జోరుగా కదులుతోంది. అది కాస్త వాయుగుండం బలపడుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఉత్తర అండమాన్ ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. సోమవారం నాటికి అది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య- వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు మెల్లగా కదులుతోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

నేటి నుంచి మూడురోజులు భారీ వర్షాలు

Advertisement

దీనికారణంగా సోమ, మంగళవారం చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశముంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60కిమీ వేగంతో బలమైనఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం వాతావరణం

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా. దక్షిణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలు మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ భాగం ఆకాశం మేఘావృతమై ఉండనుంది. అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడవచ్చని తెలిపింది. రాజధాని హైదరాబాద్‌లో ఉదయం నుంచే ఆకాశంపాక్షికంగా మేఘావృతమై చల్లని వాతావరణం నెలకొంది.

Advertisement

ALSO READ: చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అత్యవసర ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల మార్గదర్శకాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మొత్తంమీద రెండు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పేసింది.

Related News

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

Big Stories

Advertisement
×