E-Paper
Advertisement

సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దాడిలోనే మరణించాడని సిట్ నిర్ధారణ!

సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దాడిలోనే మరణించాడని సిట్ నిర్ధారణ!
Advertisement

Sai Krishna: అమరావతి ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్, డెత్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా స్థానిక కోర్టులో కీలకమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.

పోలీసుల దాడిలోనే మృతి

Advertisement

సాయి కృష్ణ పోలీసుల దాడిలోనే మరణించాడని సిట్ అధికారులు తమ ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసిన సమయం నుంచి పోలీసుల దాడికి గురై మృతి చెందే వరకు చోటుచేసుకున్న ప్రతి పరిణామాన్ని వివరంగా పొందుపరిచారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుగా మొదలై హత్యగా మారిన తీరును అధికారులు సమగ్రంగా కోర్టుకు వివరించారు.

కోర్టుకు హాజరైన సిట్ ఐవో

Advertisement

సిట్ దర్యాప్తు అధికారి (ఐవో) సుధాకర్ బాబు స్వయంగా కోర్టుకు హాజరై ఈ ఛార్జిషీట్‌ను సమర్పించారు. బాధితుడి తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణల అనంతరం, కృష్ణలంక పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా ఇందులో నివేదించారు. ప్రభుత్వం ఇచ్చిన నిష్పక్షపాత విచారణ ఆదేశాలకు అనుగుణంగానే పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసినట్లు తెలిపారు.

సాక్ష్యాలు, అరెస్టుల వివరాలు

ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. తమ ఆరోపణలకు బలమైన ఆధారాలుగా టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఆధారాలు , ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించారు.

Also Read: అక్రమంగా సంపాదించినవి పీకడానికే వెళ్లాం.. జగదీశ్ రెడ్డిపై అద్దంకి దయాకర్ ఫైర్

Tags

Related News

190 ఎకరాల భూ కబ్జా.. ఆధారాలు ఉన్నాయి.. తాడిపత్రిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్

విజయవాడ నడిబొడ్డున డీఎస్సీపై రచ్చ.. వైసీపీ vs టీచర్లు, రంగంలోకి దిగిన పోలీసులు, మంత్రి ఆగ్రహం

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×